అక్కినేని అఖిల్ బడా ప్రముఖ వ్యాపారవేత్త జైనబ్ ని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ నాగార్జున అఫీషియల్ గా ప్రకటించాడు . కాగా గత కొంతకాలంగా వీళ్లు ఇద్దరూ ప్రేమాయణం కొనసాగిస్తున్నారు అంటూ తెలుస్తుంది. మరి ముఖ్యంగా రానా-మిహిక బజాజ్ పెళ్లి మూమెంట్ నుండే స్టార్ట్ అయింది వీళ్ల ప్రేమ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకున్న సమాచారం ప్రకారం మార్చి 17వ తేదీన వీళ్ల వివాహం జరగబోతుందట .
ఈ ఫంక్షన్ ని కూడా చాలా చాలా సింపుల్ గా చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట అక్కినేని ఫ్యామిలీ . మొదట నాగార్జున - అమలా ఈ పెళ్లిని చాలా గ్రాండ్గా చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట . కానీ అఖిల్ మాత్రం చాలా సింపుల్ గానే ఈ పెళ్లి చేసుకోవాలి అంటూ ఫిక్స్ అయ్యారట. పెళ్ళి ఆడంబరం చేసుకుంటే..ఇంకా ట్రోల్లింగ్ తప్పిస్తే మనకి ఒరిగేది ఏం ఉండదు అని.. అయినా జైనబ్ కూడా చాలా సింపుల్ వే లోనే పెళ్లి చేసుకోవాలి అంటూ కోరుకుంటుంది అని చెప్పి ..అమల ని ఒప్పించాడట అఖిల్. అంతేకాదు అక్కినేని నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ల పెళ్లి జరిగే అన్నపూర్ణ స్టూడియోలోనే వీళ్ల పెళ్లి జరగబోతుందట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. అక్కినేని ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియోకి మించిన లక్కీ ప్లేస్ ఇంకేం ఉంటుంది అంటున్నారు అభిమానులు..!???