ఇప్పటికే రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా షూట్ ప్రారంభించారు . ఆల్రెడీ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జనవరి 10వ తేదీ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు ఏ హీరో చేయని సాహసాన్ని చేస్తున్నాడు రామ్ చరణ్. ఏకంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో పెడుతున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . అయితే ఇప్పుడు రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయం అభిమానులకి బిగ్ సర్ప్రైజ్ గా మారిపోయింది.
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రామ్ చరణ్ 6 మంది బడా డైరెక్టర్లతో మూవీస్ నీ లైన్ లో పెడుతున్నారట . ప్రజెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన చరణ్ ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమాకిన్ కమిట్ అయ్యాడు . ఆ తర్వాత ప్రశాంత నీల్ తో.. కూడా ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ టాక్ వినిపిస్తుంది . అంతే కాదు రామ్ చరణ్ నెక్స్ట్ డైరెక్టర్ల లిస్టులో లోకేష్ కనగరాజు అదే విధంగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి.. అదే విధంగా ప్రశాంత్ వర్మ కూడా ఉన్నట్లు తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ ఇలా సైలెంట్ షాక్ ఇచ్చాడు ఏంటి ..? అంటూ జనాలు ఓ రేంజ్ లో ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు . ఈ సినిమాల అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తే మాత్రం ఇక రామ్ చరణ్ ని టాలీవుడ్ ఇండస్ట్రీలో టచ్ చేసే వాళ్లే లేరు అని చెప్పాలి..!