గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పెళ్లికి సంబంధించిన వీడియో స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్  కొనుగోలు చేసింది అని దాదాపు 50 కోట్లు ఖర్చు చేసి మరి నెట్ ఫ్లిక్స్ వీరిద్దరి పెళ్ళికి సంబంధించిన లీగల్ రైట్స్ ను కొనుగోలు చేసింది అంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే రీసెంట్ గా అక్కినేని  ఫ్యామిలీ దగ్గర సన్నిహితులు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .


అక్కినేని ఫ్యామిలీ మొదటి నుంచి చాలా రిజర్వ్డ్ గా ఉంటుంది అని .. తమ ప్రైవేట్ ఫంక్షన్ కి సంబంధించిన విషయాలను ఎక్కడా కూడా రివిల్ చేయడానికి ఇష్టపడుదు అని అదేవిధంగా ఇలా పెళ్లికి సంబంధించిన వీడియోను డబ్బులకి అమ్మే స్ధాయికి ఇంకా అక్కినేని ఫ్యామిలీ దిగజారిపోలేదు అంటూ కుటుంబ సభ్యులు స్ట్రాంగ్ గా కౌంటర్ వేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఇది కేవలం జనాలకే కాదు నయనతారకి కూడా భారీ కౌంటర్ అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్ .



ఎందుకంటే రీసెంట్ గా నే  నయనతార తన  పెళ్లి లీగల్ రైట్స్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది . రీసెంట్గా నయనతార వెడ్డింగ్ డాక్యుమెంటరీ కూడా నెట్ ఫ్లిక్స్ లో స్లీమింగ్ అవుతుంది . దీని గురించి సోషల్ మీడియాలో ఎంత రాద్ధాంతం జరుగుతుందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  పరోక్షకంగా అక్కినేని ఫ్యామిలీ  నయనతార చేసిన పనికి కౌంటర్ ఇచ్చినట్లు అయింది అంటున్నారు జనాలు. కాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగార్జున కొడుకు నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళీపాళ్ళ పెళ్ళి డిసెంబర్ 4వ తేదీ 8:13 నిమిషాలకు జరగబోతున్నట్లు పెళ్లి పత్రికలో రాసి ఉంది . ఈ విషయాన్ని అఫీషియల్గా నాగార్జున కన్ఫామ్ చేయడం ఫాన్స్ కి కూడా మంచి హ్యాపీనెస్ క్రియేట్ చేసింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: