ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఉన్న సమయంలో ధూమ్ 2 సినిమాలో హృతిక్ రోషన్ కి జంటగా నటించింది. అలాగే ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ హృతిక్ రోషన్ ను తెగ ప్రేమిస్తుంది. అలాగే అతనితో రొమాన్స్ చేయాలని ఆశపడుతుంది .. సినిమా మొత్తం పొట్టి బట్టలు వేసుకుని హాట్ షో చేస్తూ రెచ్చిపోతుంది. అంతేకాకుండా హృతిక్ రోషన్ కు రొమాంటిక్ లిప్ కిస్ కూడా ఇస్తుంది . అయితే ఆమె ఆ సమయంలో.. అలా రొమాన్స్ చేయడం ఆమె అభిమానులకు అసలు నచ్చలేదట . ఇలాంటి ఇంటిమేట్ సీన్లు నటించడంతో కొందరు అమ్మాయిలు ఏకంగా ఐశ్వర్య ఇంటికి లీగల్ నోటీసులు కూడా పంపించారట. ఇదే విషయాన్ని గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది.


గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ ధూమ్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో చేసిన లిప్ లాక్ సీన్ కారణంగా తనకు లీగల్ నోటీసులు వచ్చాయని చెప్పింది. ఆ సన్నివేశంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తారని కూడా ఆమె వివరించింది. ప్రధానంగా తనను చాలా మంది అమ్మాయిలు రోల్ మోడల్ గా భావించే వారు ఆ సీన్లను తప్పుపట్టారు. తాను యువ‌త‌రంకు ఆదర్శంగా ఉండాలని కోరుకునే వారి నుంచి ఇలాంటి నోటీసులు రావడం ఆశ్చర్యంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది.


అలాగే ఐశ్వర్య రొమాంటిక్ సీన్ల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. అలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు అంత సౌకర్యంగా ఉండదని చెప్పింది నటిగా తన పని తాను చేస్తున్నానని కానీ ఒక సినిమాల్లో  కొన్ని సెకండ్ల సీన్ కోసం ఎందుకు తనను వివరణ ఇమ్మంటున్నారు అర్థం కాలేదని చెప్పింది. హాలీవుడ్ , యూరోపియన్ సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చేయటం లేదా ఆన్ స్క్రీన్ లిప్ కిస్ చేయటం తనకు ఇష్టం లేక ఆఫర్లు రిజర్వ్ చేస్తున్నట్లు గుర్తు చేసింది .. హాట్ సీన్స్ చేయడం తనకు ఇష్టం లేదని ఐశ్వర్య రాయ్ చెప్పినా.. ప్రొవోక్డ్, శబ్ద్, ఏ దిల్ హై ముష్కిల్ వంటి సినిమాల్లో ఆమె ఇంటిమేట్ సీన్స్‌లో నటించింది . ధూమ్ 2 తర్వాత కూడా ఇలాంటి రోల్స్, సీన్స్ చేయడం కొనసాగించింది. దీంతో ఆమెను కొందరు తప్పుబట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: