గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ స్టార్  దర్శకుడు శంకర్ దర్శకత్వం లో వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిలిం సర్కిల్స్ లో ఇప్పుడు వైరల్ గా మారింది . చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం విషయం లో సక్సెస్‌ అయిన ఓ భారీ ఫార్ములాను గేమ్ చేంజర్ లోను రిపీట్ చేయబోతున్నారట చిత్ర యూనిట్ . రామ్ చరణ్ కెరియర్ లోనే  మైల్‌ స్టోన్‌  లాంటి సినిమా రంగస్థలం .. సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాలో చిట్టి బాబు గా రామ్ చరణ్ నటన  అదరగొట్టాడు .


సినిమా తో తొలి సారిగా బెస్ట్ నటుడు గా పేరు తెచ్చుకున్నాడు . ముఖ్యం గా చెవుడు తో ఇబ్బంది పడే వ్యక్తి గా రామ్ చరణ్ నటన ప్రేక్షకుల కు ఎంతో కనెక్ట్ అయింది . కేవలం క్యారెక్టర్ ను డిఫరెంట్ గా చూపించడాని కి అన్నట్టుగా కాకుండా చిట్టి బాబుకు ఉన్న చెవుడు కారణం గానే కథ ను మలుపు తిప్పటం రంగస్థలం సినిమాకు చాలా ప్లస్ అయింది . అందుకే ఇప్పుడు గేమ్ చేంజర్ విషయం లోను అదే ఫార్ములాను రిపీట్ చేయబోతున్నాడు శంకర్ .


ఇక శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజ్ర్‌ సినిమాలో రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నాడు చరణ్. అందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే అప్పన్న పాత్ర నతితో ఇబ్బంది పడే పాత్ర అని టాక్ వినిపిస్తుంది . ఆ క్యారెక్టర్ ను కొత్తగా చూపించడానికి అన్నట్లు కాకుండా, ఆ క్యారెక్టర్ కి ఉన్న నెత్తి కారణంగానే కథ మలుపు తిరిగేలా స్క్రీన్ ప్లే డిజైన్ చేశారట శంకర్ . మరి రంగస్థలం విషయంలో వర్కవుట్ అయిన ఫార్ములా గేమ్ చేంజర్‌కు ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: