ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కపుల్స్ లో సీనియర్ హీరో జీవిత రాజశేఖర్ జంట కూడా ఒకటి ..  వీరి అన్నోన్యత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా జంటగానే వెళ్తారు.. ఈ కార్యక్రమంలో ఆయన జంటగానే కనిపిస్తారు. ఒక ముక్కలో చెప్పాలంటే జీవిత అంటే రాజశేఖర్ .. రాజశేఖర్ అంటే జీవిత అన్నట్లుగా వీరి బంధం ఉంటుంది. ఇక వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని నటి జీవిత బయటపెట్టారు .. ఓ సినిమా స్టోరీ లాగా ఉండే వీరి కథలో ఎన్నో ట్వీస్ట్‌లు మలుపులు కూడా  ఉన్నాయి .. పెళ్లి అవ్వకముందు వీరిద్దరూ కలిసి ఒకే రూమ్ లో ఉండేవారట.
 

జీవిత‌ రాజశేఖర్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తమ లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ క్రమంలో జీవిత మాట్లాడుతూ .. రాజశేఖర్ ఎంతో మంది హీరోయ‌న్స్‌తో కలిసి పనిచేసిన తనకు ఆయన మీద ప్రేమ ఇప్పుడు తగ్గలేదు. ఆయన ఇతర హీరోయిన్స్‌ తో  ఎప్పుడు అలా ప్రవర్తించలేదు. ఇద్దరి మ‌ద్య‌ ఎన్నో గొడవలు జరిగిన ఎప్పుడూ ఇద్ద‌రం  సర్దుకుపోవాలి అనే మనసుతో ఉండేవాళ్ళని జీవితా అన్నారు. ఒకరితో ఒకరు సర్దుకుపోయినప్పుడే గొడవలకు ఆస్కారం ఉండదు .. అలాగే ఇదే విషయాన్ని నా పిల్లలకి కూడా చెప్పాను. రాజశేఖర్ విషయంలో నేనెప్పుడూ ఇన్ సెక్యూర్ గా ఫీల్ అవ్వలేదు. ఒకవేళ ఏ అమ్మాయి అయినా తనని రమ్మని ఫోన్ చేస్తే .. ఆ విషయం కూడా నాకు రాజశేఖర్  చెబుతాడు. ఆయన మీద నాకు అంత నమ్మకం ఉంది అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. అలాగే జీవిత తన లవ్ స్టోరీ గురించి చెబుతూ.. తాము ఎప్పుడు పెద్దలు అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని భావించాం పెళ్ళికి రెండు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవాలని అనుకున్నాం అయితే పెళ్లికి ముందు ఇద్దరం ఒకే గదిలో ఉండే వాళ్ళంబ‌.. ఇండస్ట్రీలో ఇది పెద్ద మ్యాటర్ కాదు ..


అయితే పలుమార్లు మా విషయం చర్చకు కూడా వచ్చింది మేమిద్దరం రిలేషన్ లో ఉండగానే వేరే అమ్మాయితో రాజశేఖర్ కి పెళ్లి ఫిక్స్ చేశారు ఆయన తల్లిదండ్రులు.. ఆయన కూడా ఆ పెళ్ళికి ఒకే చెప్పారు అంటూ షాకింగ్ విషయాన్ని చెప్పింది. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆ అమ్మాయి నా కన్నా సీనియర్ .. ఆ విషయం నాకు తెలిసి నేను ఎంతో బాధపడ్డాను .. అయితే ఇలాంటి ఘటనలు జరుగుతాయని నేను ముందే ఊహించాను .. అందుకు తగ్గట్టుగానే ప్రిపేర్ అయ్యాను కానీ నావల్ల అది కాలేదు. అయితే అలా ఓసారి రాజశేఖర్ తనను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని గుడికి వెళ్దామంటూ పిలిచింది.. ఆ విషయం నాకు చెప్పి నన్ను తోడుగా తీసుకువెళ్లారు.


కారులో ముందు సీట్లో రాజశేఖర్ పక్కన ఆ అమ్మాయి కూర్చుంది నేను వెనకాల సీట్ లో కూర్చున్న మొదటిసారి తన కారులో నేను బ్యాక్ సీట్లో కూర్చోవడంతో నాకు ఎంతో బాధ అనిపించింది అంటూ ఎమోషనల్ అయ్యారు జీవిత.  తర్వాత మా ఇద్దరి విషయం వారింట్లో కూడా తెలియడంతో గొడవలు కూడా జరిగాయి .. ఆ క్రమంలోనే రాజశేఖర్ మా రిలేషన్ గురించి ఓపన్గా చెప్పేశాడు.. జీవితను దూరం పెట్టడం తన వల్ల కాదని తెగేసి చెప్పేశాడు. దాంతో ఆమె పెళ్లి ఆగిపోయింది. తర్వాత మీ ఇద్ద‌రం కలిసి ఓ సినిమాలో నటించం అయితే ఆ సినిమాలో దురదృష్టవశాత్తు రాజశేఖర్ కు యాక్సిడెంట్ అయింది.. దాదాపు నెల రోజుల పాటు రాజశేఖర్ మంచానికే పరిమితమయ్యారు. తాను దగ్గరుండి ఆయన్ను చూసుకున్నాను. అయినా కోలుకోవడానికి సంవత్సరం టైం పట్టింది .. ఆ తర్వాత మా పెళ్లి జరిగింది అంటూ తన లవ్ స్టోరీని జీవిత రాజశేఖర్ పంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: