ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు సైలెంట్ అయిపోయారు. ఓడిపోయిన తరువాత కూడా కొన్ని రోజుల వరకు ఆర్కే రోజా మీడియా ముందుకు వచ్చింది. ఆపై ఆమె అమెరికా వెళ్ళినట్లుగా వార్తలు వచ్చాయి. ఇటీవల కాలంలో రోజా పెద్దగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదు..ఈ క్రమంలోనే ఈ మాజీ నటి తన సినిమాల రీ ఎంట్రీ గురించి మాట్లాడింది. ఇప్పుడు ఆమెకు పాలిటిక్స్ నుంచి బ్రేక్ దొరికినట్లే. ఐదేళ్లపాటు ఖాళీగా ఉండాల్సిందే ఈ సమయంలో సినిమాల్లో నటిస్తారా అని ఆమెను తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.

1991లో వచ్చిన ప్రేమ తపస్సు సినిమాతో రోజా నటిగా మారింది ఫస్ట్ సినిమాతోనే చాలా గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ రాజేంద్రప్రసాద్ లాంటి పాపులర్ హీరోలతో జతకట్టింది ఆమె చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ దక్కించుకుంది. హీరోయిన్గా కొంతకాలం రాణించిన తర్వాత ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి అలరించింది. శంభో శివ శంభో, మొగుడు, గోలీమార్ లాంటి సినిమాల్లో ఆమె బలమైన పాత్రలను పోషించింది.

ఈ సినీనటి చివరిగా నటించిన మూవీ 2013లో వచ్చిన D/o వర్మ. దీని తర్వాత ఆమె మళ్ళీ వెండితెరపై కనిపించలేదు. కానీ ఆమెకు నటించాలనే ఉందని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే తాను చిన్న పాత్రలు చేయనని మంచి వెయిట్ ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని స్పష్టం చేసింది. 'బాహుబలి'లో శివగామి, 'అత్తారింటికి దారేది' సినిమాలో అత్త లాంటి క్యారెక్టర్లు వస్తే తప్ప మళ్ళీ సినిమాల్లో నటించనని ఈ అందాల తార వెల్లడించింది. డాక్టర్, లాయర్ వంటి కీలక రోల్స్ పోషించాలని ఆశ కూడా ఉన్నట్లు ఆమె తన మనసులోని మాట బయట పెట్టింది. అయితే చేతిలో రోజాను వెండితెరపై చూడొచ్చా అని ఫ్యాన్స్ ఆశ అడుగుతున్నారు ఒకవేళ దర్శన నిర్మాతలు ఆమెకు తగిన ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే ఆఫర్ చేసే అవకాశం ఉంది. అని ఇది పొలిటికల్ కెరీర్ పై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందా అనేది కూడా ఆలోచించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: