టాలీవుడ్ కోలీవుడ్ లో ఈరోజు మంచి పాపులారిటీ సంపాదించిన సిద్ధార్థ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. వరుసగా సినిమాలలో హీరోగా నటిస్తున్న సరైన సక్సెస్ అందుకోలేక సతమతమవుతున్నారు అప్పుడప్పుడు పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటిస్తూ ఉంటారు. ఏజ్ పెరిగినప్పటికీ కూడా సిద్ధార్థ్ ఇంకా యంగ్ హీరోగా హ్యాండ్సమ్ లుక్లో అదే ఎనర్జీతో కనిపిస్తూ ఉన్నారు. అయితే గడచిన కొద్ది నెలల క్రితం హీరోయిన్ అదితి రావు నీ ప్రేమించి మరి వివాహం చేసుకోవడం జరిగింది.


వీరి వివాహం సెప్టెంబర్ 16న చాలా సింపుల్గా ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఇప్పుడు మరొకసారి ఈ జంట ఇప్పుడు వివాహం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది అదితి రావు హైదరి. రాజస్థాన్లోని అలీల పార్ట్ లో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేయించుకున్నట్లుగా ఈ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో అదితి రెడ్ లెహంగాలో పెళ్లికూతురుగా చాలా అందంగా ముస్తాబ్ అయ్యింది..సిద్ధార్థ్ సైతం పెళ్లికొడుకు గా చాలా అందంగా కనిపిస్తూ ఉన్నారు. వీరికి సంబంధించి ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.


ఏంటి మళ్లీ ఈ జంట పెళ్లి చేసుకుందాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని ఇప్పుడు పెళ్లికి కారణమయ్యిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అదితి పూర్వీకుల ఆచారం ప్రకారమే రంగనాథ దేవాలయంలో వివాహం జరిగిందని ఇప్పుడు వారి కోరిక మేరకే మరొకసారి డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. మొత్తానికి చాలా క్యూట్ గా ఈ ఫోటోలలో అటు సిద్ధార్థ్.. అదితి చాలా క్యూట్ గా కనిపిస్తూ ఉన్నారు. చివరిగా ఇండియన్-2 చిత్రంలో నటించిన సిద్ధార్థ్ తన పాత్రకు న్యాయం చేసిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: