కోలీవుడ్ ,టాలీవుడ్ లో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో ధనుష్ నిరంతరం ఏదో ఒక విషయంలో వినిపిస్తూ ఉంటారు.. ఇటీవలే నయనతార విషయంలో కూడా తరచూ ధనుష్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నది.. అయినప్పటికీ కూడా వాటన్నిటిని పట్టించుకోకుండా తిప్పికొడుతూనే ఉన్నారు ధనుష్. ముఖ్యంగా ఐశ్వర్య తో ధనుష్ విడాకుల వ్యవహారం ఈరోజుతో ముగిసినట్టుగా వార్త వినిపిస్తున్నాయి.. ఎట్టకేలకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లుగా సమాచారం. అందుకు సంబంధించి ఒక న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.


గడిచిన కొంతకాలం క్రితం ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టు కొంత సమయాన్ని వీరు కలిసి ఉండడానికి ఇచ్చినప్పటికీ వీరు సమూహంగా లేమని గత వారం రోజుల క్రితం కోర్టు విచారణలో భాగంగా ఇద్దరు తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో వీరు ఏకాభిప్రాయం ఆధారంగా కోర్టు తీర్పు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ ను ,ధనుష్ 2004లో ప్రేమించి మరి వివాహం చేసుకోవడం జరిగింది.. అయితే 2002లో వీరిద్దరూ విడిపోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది.


అప్పటినుంచి విడాకుల కోసం వెయిట్ చేసిన ఈ జంట ఈ రోజున ఎట్టకేలకు విడాకులు మంజూరైనట్లుగా తెలుస్తోంది. అభిమానులు వీరిద్దరూ కలిసిపోతారు అనుకుంటున్నా సమయంలో ఇలా సడన్గా విడాకులు కోర్టు మంజూరు చేయడంతో కాస్త నిరాశలో ఉన్నారు. ఇక ధనుష్ కు, ఐశ్వర్య కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరి వీరికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఇద్దరు చూసుకుంటామని తెలియజేసినట్లు సమాచారం. ధనుష్ స్వయంగా ఇటీవలే నటించి డైరెక్షన్ చేసిన చిత్రం రాయన్ ఈ సినిమా కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మొత్తానికి ధనుష్ పాన్ ఇండియా లెవల్లో సినిమాలను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. అందుకే తను రాబోయే రోజుల్లో సినిమాలలో కంటే డైరెక్టర్ గానే ఎక్కువగా కనిపించబోతున్నట్లు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: