పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. పవర్ స్టార్ కు తోడు డిప్యూటీ సీఎం పదవితో.. ఆయన పవర్ ఇంకాస్త పెరిగింది. ఆయన ఫాలోయింగ్ కి తోడు.. పవర్ కూడా తోడు అవ్వడంతో నలుగురికి మంచి చేయాలి అన్న ఆయన ఆకాంక్షన్ తీర్చుకోబోతున్నాడు మెగా హీరో. ఈక్రమంలో నిరంతరం సమీక్షలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు సినిమాలు కూడా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారట పవన్ కళ్యాణ్.ఇక ఈ రాజకీయంగా ఈ స్థాయికి రావడానికి పవన్ కళ్యాణ్ ఎన్నో కష్టనష్టాలు అనుభవించారు. ఎన్నో అవమానాలు దిగమింగారు.. తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు కూడా రెచ్చిపోయి తిడుతున్నా.. నొరు మెదపకుండా తన టైమ్ కోసం ఎదురు చూశారు. పార్టీ కోసం కష్టపడ్డారు. ఎవరైతే తనను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అన్నారో వారికంటే పది సీట్లు ఎక్కువే సాధించి రికార్డ్ నెలకొల్పారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక ప్రభుత్వంలో భాగంగా డిప్యూటీ సీఏం గా బిజీ బిజీగా గడుపుతున్న పవర్ కళ్యాణ్ ఆర్డర్స్ కోసం ఎంతో మంది అధికారులు ఎదురు చూస్తుంటారు. ఆయన సైన్ కోసం ఐఏఎస్ లు, ఐపీఎస్ లు వెయిట్ చేస్తుంటారు. అటువంటిది పవర్ స్టార పవర్ కళ్యాణ్ మాత్రం తన పర్సనల్ లైఫ్ లో ఓ లేడీ మాటకు బాగా విలువిస్తారట. ఆమెమాటంటే ఆయనకు శాసనమేనట. అంతే కాదు ఇంట్లో కూడా ఆమె పెత్తనేమ నడుస్తుందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? ఆమె ఎవరో కాదు పవన్ కళ్యాణ్ గారాల కూతుర ఆధ్య.  అవును పవర్ కళ్యాణ్ కు ఆధ్య అంటే ప్రాణం. ఆమె మాట జవదాటడట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ వెల్లడించారు. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ కు చెప్పడానికి ఎవరైనా ఆలోచిస్తారేమో కాని ఆధ్య మాత్రం ఏది ఉన్నా చెప్పేస్తుంది.పవన్ కూడా ఎవరి మాట విన్నా వినకపోయినా.. ఆధ్య చెపితే వినాల్సిందే. కొండమీద కోతిని అడిగినా తెచ్చిస్తాను అంటారట పవన్ కళ్యాణ్. ఇంట్లో ఏది చేయాలనన్నా.. ఆధ్య మాటమీదనే జరుగుతుందట. ఈ విషయాన్ని రేణు దేశాయ్ వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ తన పిల్లను, ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వారికి ఇవ్వాల్సిన టైమ్ వారికి కేటాయిస్తారు. ఎంత హడావిడి ఉన్నా ప్యామిలీని మాత్రం మర్చిపోరు పవన్.

మరింత సమాచారం తెలుసుకోండి: