అయితే అలాంటి సమయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ ప్రాజెక్టుని చేతిలోకి తీసుకోవడం జరిగింది.. ఆ సమయంలో వేణు దోనెపూడి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని సైతం సెటిల్ చేసి ఇస్తానంటూ ఒక అగ్రిమెంట్ను కూడా తెలియజేశారట విశ్వప్రసాద్. అయితే సినిమా రిలీజ్ అయ్యే దానికి ముందే బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అయ్యాయట .కానీ వేణు దోనెపూడికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ని మాత్రం పీపుల్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ చెల్లించలేదట. అంతేకాకుండా కాల్ చేసిన కూడా లిఫ్ట్ చేయలేదని చాంబర్ పెద్దలతో వేణు దోనెపూడి కంప్లైంట్ ఇచ్చినట్లుగా సమాచారం.
ఇలా చేసినప్పటికీ కూడా పీపుల్ మీడియాకి చెందిన టీమ్ మాత్రం అసలు వేణుని పట్టించుకోవడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వం సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ చాలామంది చెల్లించాల్సిన డబ్బులను కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఇంకా చెల్లించలేదని అక్కడ ఫిలిం ఛాంబర్ అధినేతలతో చెప్పినట్లు సమాచారం. మరి ఈ ఛాంబర్ పెద్దల కేసును ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి మరి. పీపుల్ మీడియా బ్యానర్ పైన ఇప్పటికే ఎన్నో బడా చిత్రాలు తెరకెక్కించడమే కాకుండా రాబోయే చిత్రాలలో కూడా ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో ఇలాంటి బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటే చాలా ఇబ్బందులని పలువురు నేటిజన్స్ తెలుపుతున్నారు. మరి ఈ విషయం మీద టీజీ విశ్వప్రసాద్ స్పందిస్తారేమో చూడాలి.