టాలీవుడ్ లో ప్రతీ ఏడాది స్టార్ హీరోల సినిమాలు విడుదలయి కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ ఉంటాయి.. అలాగే ఎలాంటి అంచనాలు లేని సినిమాలు కూడా విడుదలయి సంచలన విజయం సాధిస్తాయి.. అలాంటి సినిమాలలో “సీతారామం “ ఒకటి.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలయిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమాను స్వప్న సినిమాస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మించారు.ఈ ఎపిక్ లవ్ స్టోరీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.. మహానటి సినిమాలో జెమినీ గణేశన్ గా అద్భుతంగా నటించి మెప్పించిన దుల్కర్ సల్మాన్ హీరోగా, క్యూట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది..ఈ సినిమాలో రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, గౌతమ్ మేనన్ వంటి స్టార్స్ కీలక పాత్ర పోషించారు..ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు..

ఫీల్‌గుడ్‌ ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకులు సైతం ప్రశంసలు అందించారు. బాక్సీఫీస్‌ వద్ద కూడా ఈ చిత్రం మంచి వసూళ్లని రాబట్టింది.ఆర్మీ నేపథ్యంలో కొనసాగే ఓ పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా సీతారామంను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది..లెఫ్ట్నెంట్ రామ్ గా దుల్కర్ అలాగే ప్రిన్సెస్ నూర్జహాన్ గా, సీతగా మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించారు..రామ్ కోసం సీత అన్నింటిని వదులుకొని వచ్చేస్తుంది.వారిద్దరి మధ్య సాగే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులకు కన్నీరు తెప్పిస్తాయి.. ఇక పాకిస్తాన్ ఆర్మీకి రామ్ దొరికిపోయి తిరిగి రాలేక తన చివరి ఉత్తరాన్ని సీతకి అందేలా చేస్తాడు.. ఈ సినిమా క్లైమాక్స్ లో ఆ ఉత్తరం సీతకి అందుతుంది.. రామ్ ఇక లేడని ఇదే తన చివరి ఉత్తరమని తెలిసి సీత వెక్కి వెక్కి ఏడుస్తుంది.. ఆ సీన్ ఎప్పుడు చూసిన కానీ కన్నీరు పెట్టకుండా ఉండలేరు దర్శకుడు హను రాఘవపూడి అంత అద్భుతంగా తెరకెక్కించారు..బాధాకరమైన ముగింపు ఇచ్చినా కూడా సీతారామం సినిమా ప్రేక్షకుల హృదయాలని గెలిచింది..

మరింత సమాచారం తెలుసుకోండి: