రాఖీ పౌర్ణమి పండుగ వస్తే కచ్చితంగా టీవీ చానల్స్ లో గోరింటాకు సినిమా రావాల్సిందే. ఈ సినిమా అన్నా చెల్లెళ్ల ప్రేమకు ప్రతిరూపంగా తెరకెక్కింది. మంచి ఎమోషనల్ సీన్స్ ద్వారా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.. అయితే అలాంటి గోరింటాకు సినిమా గురించి కొన్ని తెలియని విషయాలు తెలుసుకుందాం..

 గోరింటాకు మూవీ:

 
యాంగ్రీ మ్యాన్ గా తెలుగు చిత్ర సీమ పరిశ్రమలో పేరు తెచ్చుకున్న రాజశేఖర్ హీరోయిన్ మీరాజాస్మిన్ అన్నా చెల్లెళ్లుగా తెరకెక్కిన మూవీ గోరింటాకు. ఈ సినిమాలో రాజశేఖర్ భార్యగా ఆర్తి అగర్వాల్ మీరాజాస్మిన్ భర్తగా హీరో ఆకాష్ లు నటించారు. అలాగే శివాజీ రాజా, చంద్రమోహన్ లు కీలక పాత్ర పోషించారు. అ లాగోరింటాకు మూవీ కన్నడలో విడుదలైన తంగి అనే మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. కన్నడలో శివ రాజ్ కుమార్ హీరోగా చేశారు.దాన్నే తెలుగులో గోరింటాకు మూవీగా రీమేక్ చేశారు.. సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థలో ఆర్ బి చౌదరి, పరాన్ జైన్ లు నిర్మాతలుగా.. వి ఆర్ ప్రతాప్ దర్శకుడిగా తెరకెక్కిన గోరింటాకు మూవీ 2008 జూలై 4న విడుదలై బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ సాధించింది.. ఈ సినిమా అన్నాచెల్లెళ్ల ప్రేమకు ప్రతిరూపంగా తెరకెక్కింది.ఇందులో తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ తన చెల్లిని కంటికి రెప్పలా చూసుకుంటారు హీరో రాజశేఖర్..


 ఇక బావ నుండి తప్పించుకొని హీరోయిన్ ఆర్తి అగర్వాల్ మీరాజాస్మిన్ ఇంట్లో తలదాచుకుంటుంది. అలా వారి కంపెనీలో పని ఇస్తారు. ఇక మీరాజాస్మిన్ ఆకాష్ లు ప్రేమించుకుంటారు. ఈ విషయం తెలిసిన రాజశేఖర్ ఇంటికి పనివాడిగా వెళ్లి వాళ్ల క్యారెక్టర్ తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరి పెళ్లి జరిగిపోవడం.అలాగే మీరా జాస్మిన్ తన ఫ్రెండ్ అయినటువంటి ఆర్తి అగర్వాల్ ని తన అన్నయ్యకి భార్యగా చేయడం వంటివి జరుగుతుంది. కానీ మధ్యలో కాంతం పాత్రలో ఆర్తి అగర్వాల్ మేనేత్తగా చెప్పుకొని హేమా చౌదరి ఎంట్రీ ఇస్తుంది.ఆమె ఎంట్రీ తో ఇంట్లో గొడవలు మొదలవుతాయి.అలా మీరాజాస్మిన్ అత్తింట్లో చిచ్చు పెట్టడమే కాకుండా ఆర్తి అగర్వాల్ కి లేనిపోనివి చెప్పి ఆడపడుచు మీరాజాస్మిన్  ని ఇంటికి రాకుండా చేయాలని చూస్తుంది. అలా చివరికి ఆర్తి అగర్వాల్ చెప్పుడు మాటలు విని భర్తకి ఆడపడుచుని దూరం చేయాలని చూస్తుంది.

 కానీ చివర్లో దిక్కులేని స్థితిలో మీరాజాస్మిన్ తన భర్త పోలీస్ స్టేషన్లో ఉండడం పుట్టింటికి వెళ్తే కనీసం తిండి కూడా పెట్టకపోవడంతో తన ముగ్గురు పిల్లలతో కలిసి బావి లో పడుతుంది. ఆ తర్వాత భార్య నిజస్వరూపం రాజశేఖర్ కి తెలిసి ఆర్తి అగర్వాల్ ని తిట్టి చెల్లి దగ్గరికి వస్తాడు. కానీ అప్పటికే మీరా జాస్మిన్ ఆమె పిల్లలు చనిపోయి ఉండడంతో చెల్లిని పిల్లల్ని పట్టుకొని గుక్క పెట్టి ఏడుస్తాడు. ఆ తర్వాత ఏడుస్తూనే రాజశేఖర్ గుండె కూడా ఆగుతుంది.అలా చివర్లో హీరో రాజశేఖర్ కూడా చెల్లి తో పాటే మరణిస్తాడు. ఇక ఈ సినిమా అప్పట్లో కుటుంబ కథా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ముఖ్యంగా పెళ్లయ్యాక అన్న చెల్లెల మధ్యలోకి వచ్చిన వదిన చేసే నిర్వాకం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ఇక చివర్లో అన్నా చెల్లెళ్లు మరణించడంతో ఈ సినిమా చూసిన ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకొని థియేటర్ల నుండి బయటకు వచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: