రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరో కైనా ఆ తర్వాత ప్రాబ్లం రావాల్సిందే. రాజమౌళి పై ఉన్న అతిపెద్ద రిమార్క్ ఇది. టాలీవుడ్ లో ఉన్న అతిపెద్ద బ్యాడ్ సెంటిమెంట్ ఇది. ఈ విషయంలో రాజమౌళి కూడా ఏం ?చేయలేడు .. అంతా విధిరాత అనుకోవాల్సిందే. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ నెగిటివ్ సెంటిమెంట్ ను ఎట్టకేలకు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. రాజమౌళితో త్రిబుల్ ఆర్ సినిమా చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేసి హిట్టు కొట్టాడు. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. దేవర కని వినీ ఎరుగని రేంజ్ లో ఏకంగా రు. 550 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పుడు అందరు చూపు మెగా పవర్ స్టార్ రాంచరణ్ పై పడింది. రామ్ చరణ్ కూడా త్రిబుల్ ఆర్ సినిమాలో నటించాడు. ఆ తర్వాత ఆచార్య సినిమాలో నటించాడు.
ఆచార్య సినిమా అతి పెద్ద డిజాస్టర్ అయింది .. పోనీ అది మల్టీస్టారర్ చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ చిన్న రోల్ చేశాడు అనుకుందాం .. అయితే ఇప్పుడు సోలో హీరోగా గేమ్ ఛేంజర్ సినిమాతో వస్తున్నాడు. గతంలోనూ రామ్ చరణ్ రాజమౌళి బాధితుడు. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆరెంజ్ తో అతిపెద్ద డిజాస్టర్ ఇచ్చాడు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా ? రాజమౌళిని ఆ నెగటివ్ సెంటిమెంట్ నుంచి ఒడిన పడేస్తాడా అన్నది చూడాలి. స్టూడెంట్ నెంబర్ వన్తో ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేశాడు రాజమౌళి ఆ తర్వాత సుబ్బు ప్లాప్... సింహాద్రి తర్వాత ఆంధ్రవాలా ప్లాప్ .. యమదొంగ తర్వాత కంత్రి ప్లాప్ .. ఎట్టకేలకు ఈ బ్యాడ్ సెంటిమెంట్లు దేవరతో బ్రేక్ చేశాడు. మరి మగధీత మగధీర తర్వాత ఆరెంజ్ తో దెబ్బ తిన్న రాంచరణ్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ తో ఆ నెగటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని కోరుకుందాం.