తెరపై వీళ్ళు జత కడితే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే . చరిత్ర అదే చెబుతుంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాక త్రిష చాలా చాలా పక్కాగా సినిమాలను చూస్ చేసుకుంటూ వస్తుంది. తెలుగులో చిరంజీవితో విశ్వంభర సినిమాలో కూడా నటిస్తుంది . ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది . అయితే నాగార్జున వందవ సినిమాలో కూడా హీరోయిన్గా త్రిష నే సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇదే మూమెంట్లో ప్రభాస్ సరసన ఒక సినిమాలో నటించే అవకాశం అందుకుంది త్రిష అంటూ బాగా వార్తలు వినిపించాయి. త్రిష - సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కే ప్రభాస్ సినిమాలో హీరోయిన్గా అనుకున్నారట మేకర్స్.
అయితే ప్రభాస్ మాత్రం " ఆమె నా సినిమాలో వద్దనే వద్దు సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి " అంటూ సందీప్ రెడ్డివంగా కి ఫైనల్ డెసిషన్ చెప్పేసారట . ఏ హీరోయిన్ అయినా పర్లేదు ఆ బ్యూటీ మాత్రం అస్సలు వద్దు అంటూ తేల్చేసారట . అయితే రీజన్ మాత్రం చెప్పలేదట ప్రభాస్ . అయితే సందీప్ రెడ్డివంగా ప్రభాస్ పరిస్థితిని అర్థం చేసుకొని ఆమెను కాకుండా నయనతారను చూస్ చేసుకున్నారట . కానీ ధనుష్ తో జరిగిన గొడవ కారణంగా నయనతారను కూడా మేకర్స్ ఆమె వస్తే ఈ సినిమా కి తమిళనాడు లో నెగిటివ్ టాక్ వస్తుంది.. ఈ సినిమా కాంట్రవర్షియల్ అవుతుంది అంటూ ఆమెను కూడా తప్పించేసారట . ఫైనల్లీ అలియాభట్ ఈ మూవీలో సెలెక్ట్ అయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎందుకు ప్రభాస్ - త్రిష ని వద్దన్నాడు..? అంటే మాత్రం జనాలు గతంలో త్రిష - ప్రభాస్ ని చీట్ చేసిందన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!