అక్కినేని వారసులు నాగచైతన్య - అఖిల్ ఇద్దరు వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. నాగచైతన్యకు స్టార్ హీరోయిన్ సమంత తో ఇప్పటికే పెళ్లి జరిగి విడాకులు కూడా అయిపోయాయి. అఖిలకు శ్రియ భూపాల్ తో ఎంగేజ్మెంట్ జరిగి పెళ్లి వరకు వెళ్లకుండానే క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఒకేసారి ఈ అన్నదమ్ములు ఇద్దరు పెళ్లికి సిద్ధమవుతున్నారు. అయితే ఒక బ్యాడ్ సెంటిమెంట్ అక్కినేని అభిమానులను బాగా టెన్షన్ పడుతోంది. సమంత - నాగచైతన్య పెళ్లి జరుగుతున్న టైం లోనే . . అంటే పెళ్లికి కాస్త ముందే అఖిల్ కు ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ రెండు ఈ అన్నదమ్ములకు అప్పుడు పెళ్లి లేదా ఎంగేజ్మెంట్ కలిసి రాలేదు. చైతు పెళ్లి విచ్ఛిన్నం అయింది ... అఖిల్ ఎంగేజ్మెంట్ తోనే సరిపెట్టుకున్నాడు. ఆ బంధం పెళ్లి వరకు వెళ్లలేదు.
ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత్తో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. డిసెంబర్ 5న చైతు - శోభిత పెళ్లి జరగనుంది. ఈ పెళ్ళికి ముందే అనుకోకుండా అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఈసారి అఖిల్ జైనాబ్ రవ్జ్ దే తో ఎంగేజ్మెంట్ చేసుకునే పెళ్లికి రెడీ అవుతున్నాడు. కొన్నేళ్ల క్రితం ఈ అన్న దమ్ములు చైతు అఖిల విషయంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి. ఇప్పుడు కూడా కాకతీయంగా మళ్ళీ ఇద్దరి పెళ్లి విషయంలో అలాంటి సంఘటనలే రిపీట్ అవుతున్నాయి. అప్పుడు ... ఇప్పుడు సేమ్ టు సేమ్ అన్నట్టుగా ఈ కుటుంబంలో జరుగుతుంది. దీంతో అక్కినేని కుటుంబంలో నాటి సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుంది ఏంటని ఆ కుటుంబ అభిమానుల్లో కాస్త టెన్షన్ మొదలైంది. ఇక అఖిల్ చివరి సారిగా నటించిన ఏజెంట్ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.