పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎంత పవర్ఫుల్ గా ఉంటారో ఆయన ఇమేజ్ ఎలా ఆకాశంలో ఉంటుంది అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ నటించిన సినిమాలు వరుస పెట్టి ప్లాపుల మీద ప్లాపులు అవుతున్నా పవన్ ఇమేజ్ రోజు రోజుకు పెరుగుతూ వస్తోందే తప్పా కించింత్ తగ్గలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఎంత పవర్ఫుల్గా ఉన్నా ఆయన ఇంట్లో పెత్తనం మాత్రం ఆయన చేతిలో ఉండదట .. ఇంకా చెప్పాలి అంటే బయట మనోడు ఎంత పవర్ స్టార్ అయినా .. ఎంత పవన్ కళ్యాణ్ అయినా ఇంట్లో ఆమె మాట వినాల్సిందే .. ఇంతకూ ఎవరు ఆమె ఆ కథ ఏమిటి అనుకుంటున్నారా ?
పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు మూడు దశాబ్దాలు అవుతుంది. కోట్ల మంది అభిమానులను పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తన పవర్ చూపించారు. జనసేన పార్టీ స్థాపించి నూటికి నూరు శాతం విజయాలు సొంతం చేసుకోవడంతో పాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రజలకు ఏదైనా మంచి చేయాలి అన్న తపన పవన్ కళ్యాణ్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పవన్ ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎం అయినా తెలుగు సినిమా రంగానికి పవర్ స్టార్ అయినా ఇంట్లో మాత్రం తన కుమార్తె ఆధ్య పెత్తనమే నడుస్తుంది అట. ఆమె ఎవరో ? కాదు పవన్ కళ్యాణ్ గారాల పట్టి ఆధ్య.
పవన్ కళ్యాణ్ కు ఆధ్య అంటే ప్రాణం. ఆమె మాట జవదాటడు అట ఈ విషయాన్ని ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ స్వయంగా చెప్పారు. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ కు ఏదైనా చెప్పడానికి ఎవరైనా సంకోచిస్తారు ఏమోగానీ ఆది మాత్రం ఉన్నది ఉన్నట్టుగా మొహమాటం లేకుండా చెప్పేస్తుంది అట.