ఇప్పుడు అన్ని ఈవెంట్లు సంగతి సరేగాని తెలుగు స్టేట్స్ లో అల్లు అర్జున్ ఈవెంట్ ఎప్పుడు ? ఛీఫ్ గెస్ట్ ఎవరొస్తారు ? అనే ఆసక్తి కూడా అందరి లో కనిపిస్తుంది . ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ఇచ్చే అప్డేట్స్ ఏం ఉండబోతున్నాయి అన్నది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ .. అతి త్వరలో నే ముంబై లో ఓ భారీ ఈవెంట్ జరగబోతుంద ని నార్త్ అభిమానుల్ని ఊరిస్తున్న విషయం .కొత్త గా ట్రై చేసినా.. బేస్‌ని వదల కుండా కవర్ చేయాలన్న ది పుష్ప పబ్లి సిటీ స్ట్రాటజీ . అందుకే హీరో , హీరోయిన్లు ముందుండి పబ్లిసిటీ పనులు చూసుకుంటున్నారు .
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో జరిగే పుష్ప ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారో అనే దానికి ఒక క్లారిటీ వచ్చింది .. ఎవరు ఊహించని విధంగా పుష్ప ఈవెంట్ కు చిరంజీవి - బాలకృష్ణ ఇద్దరు చీఫ్ గెస్ట్ గా వస్తారని అంటున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న మెగా వర్సెస్ అల్లు అర్జున్ వారు ఈవెంట్‌తో పుల్ స్టాప్ పెట్టాలని బన్నీ డిసైడ్ అయ్యాడని తెలుస్తుంది. అందులో భాగంగానే రీసెంట్ గా వచ్చిన ఆన్ స్టాపబుల్ లో కూడా పవన్ కళ్యాణ్ - చిరంజీవిపై అల్లు అర్జున్ పాజిటివ్‌గా స్పందించాడు. అలాగే బాలయ్య కూడా అల్లు అర్జున్ ఆకాశానికి ఎత్తేసాడు. గతంలో అఖండ ఈవెంట్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకు బాలయ్య - చిరంజీవి గెస్ట్ గా వస్తే సినిమాకు ఊహించని రేంజ్ లో కలెక్షన్ ఉంటాయని అటు కూటమి ప్రభుత్వం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.