టాలీవుడ్ లో ఇప్పుడు మరో కొత్త కాఫీ వివాదం తెరమీదకు వచ్చింది .. గతంలో శ్రీమంతుడు ఆ తర్వాత బలగం వరకు మరికొన్ని చిన్న వివాదాలు కాపీరైట్ గురించి మొదలయ్యాయి .. డుంగ్రోత్ నాగరాజు అనే రచయిత సంచలన ఆరోపణలతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ గా మారింది. సందీప్ రెడ్డి వంగా పై నాగరాజు సంచలన ఆరోపణలతో విరుచుకుపడ్డాడు. సందీప్ రెడ్డి తెరకెక్కించిన అర్జున్ రెడ్డి మూవీ తన కథ నుంచి కాపీ చేశారని ఆయన ఆరోపించాడు.. అదేవిధంగా టాలీవుడ్ రచయితల సంఘానికి ఆయన ఫిర్యాదు చేస్తూ పోస్టు కూడా చేశాడు.. ఇక ఆయన చేసిన ఫిర్యాదులను ఒకసారి పరిశీలిస్తే .. నేను రచయితల సంఘంలో శాశ్వత సభ్యుణ్ణి నేను ఎంతో కష్టపడి 2017లో.. ఇక సెలవ్ అనే ఒక సినిమాను నా సొంతంగా డబ్బులతో నిర్మించాను..


ఇక అది పెద్దగా రిలీజ్ చేయలేక మూడు నాలుగు థియేటర్లో మాత్రమే రిలీజ్ చేసి.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ ఫిలిం ఛాంబర్ లాంటి చోట్ల చాలా షోస్ ప్రదర్శించాను. నేను తర్కెక్కించిన  ఇక సెలవ్ సినిమాలోని కథని సన్నివేశాలని సందీప్ రెడ్డి వంగ ఊహించని విధంగా అర్జున్ రెడ్డి సినిమాలో కాపీ కొట్టాడు. తెలంగాణ మారుమూల గిరిజన లంబాడి కుటుంబానికి చెందిన నేను సినిమా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి రచయితగా దర్శకుడుగా నిర్మాతగా నా సొంత డబ్బులు పెట్టి సినిమా తీస్తే.. దాన్ని సందీప్ రెడ్డి కాపీ కొట్టడం వల్ల నేను తీవ్రంగా నష్టపోయాను.. ఇక సెలవ్ సినిమా తీయడానికి చేసిన అప్పులు తీర్చలేక ఇప్పటికీ ఎన్నో బాధలు అనుభవిస్తున్నాను. ఆ బాధలు భరించలేక ఆత్మహత్యకు కూడా ప్రయత్నించా.. ప్రస్తుతం నా ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు అర్జున్ రెడ్డి , ఇక సెలవ్‌ సినిమాలు చూసి మీరందరూ నాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని విన్నవిచ్చుకుంటున్నాను.


రేపు నా ఆరోగ్యం క్షేనించి నేను చనిపోతే దానికి కచ్చితంగా సందీప్ రెడ్డి వంగనే కారణము అవుతాడు. అత‌నిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు నా ఆత్మహత్యకు కారణం అయినందుకు చాలా కేసులు పెడతాను అంటూ ఇది బెదిరింపు కాదు నా బాధ దయచేసి నన్ను అర్థం చేసుకోండి డుంగ్రోత్ నాగరాజు అంటూ సంచల ఆరోపణలు చేశాడు.  ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు నేటిజ‌న్ల మాత్రం ఇక సెలవ్‌ సినిమాకి అర్జున్ రెడ్డికి అసలు పోలికి లేదని కామెంట్లు చేస్తున్నారు. అసలు నాగరాజుకి సినిమా చూడటం చేతకాని వెధవ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగ పై ఇంకా చాలా ఆరోపణలు చేశారు ముందుగా విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి చెప్పిన కథ రిజెక్ట్ చేశాడని.. దిక్కుతోచక నాకథని కాపీ చేసి ఒప్పించాడని నాగరాజు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై సందీప్ ఎలా స్పందిస్తాడో అనేది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: