యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే హీరో అయ్యాడు.. కేవలం 17 సంవత్సరాల వయసులోనే ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆది , స్టూడెంట్ నెంబర్ వన్ , సింహాద్రి వంటి సినిమాలతో ఒక్కసారిగా టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా దూసుకుపోయాడు .. ఎన్టీఆర్ కెరియర్ మొదటిలో చాలా లావుగా ఉండేవాడు. రాజమౌళి తో సినిమా చేసే సమయంలో ఆయన బలవంతం చేసే వరకు బరువు తగ్గాలని ఆలోచన ఆయనకు లేదు. రాజమౌళి బలవంతం చేయడంతో యమదొంగ సినిమా కోసం ఎన్టీఆర్ సన్నబడ్డాడు. గతంలో ఓ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ తన బరువు గురించి చిత్ర పరిశ్రమ లో ఉన్నవారు ఎగతాళి చేసే వారిని కూడా చెప్పాడు.


గతంలో మాస్ మహారాజా రవితేజ పై ఎన్టీఆర్ ఫన్నీగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. రవితేజ అని నేను ముద్దుగా రవన్న అని పిలుస్తా.. నాన్న హరికృష్ణ నటించిన సీతారామరాజు మూవీలో ఆయన నటించాడు.. నేను చిన్న వయసులో షూటింగ్ లోకేషన్ కి వెళ్లేవాడిని అప్పటి నుంచి రవన్న నాకు తెలుసు . అప్పుడు నేను ఎంతో లావుగా ఉండేవాడిని సీతారామరాజు తర్వాత కొన్ని సంవత్సరాలు రవ్వనని నేను కలవలేదు.  ఒకసారి కె.వి.ఆర్ పార్కులో  జాగింగ్ కి  వెళ్లాను రవన్న కూడా అక్కడికి వచ్చారు. ఆ సమయంలో ఆయన పూరి జగన్నాథ్ గారితో సినిమా చేస్తున్నారట. అనుకోకుండా ఇద్దరం కలుసుకున్నాం.. అప్పటికి నేను బరువు తగ్గలేదు నా బరువుపై ఆ సమయంలో ఫన్నీగా సెటైర్లు కూడా వేశారు.


ఇంకా ఇలాగే ఉన్నావు అబ్బాయి ఏదోలే అన్నా ట్రై చేస్తున్నా కానీ తగ్గటం లేదని ఎన్టీఆర్ సమాధానం ఇచ్చాడు. ఒకరు రోజు నా సినిమా షూటింగ్ పూర్తయ్యే సరికి మిడ్ నైట్ అయింది. షూటింగ్ పూర్తి చేసుకుని వెళుతుంటే ఇడియట్ సినిమా హోర్డింగ్ కనిపించింది. ఆ పోస్టర్ నాకు తెగ నచ్చేసింది. వెంటనే రవన్నకి ఫోన్ చేశా.  ఆ పోస్టర్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు బావుండాలి అని చెప్పా. ఆయన కష్టపడే వ్యక్తి. అలాంటి వారంతా బావుండాలి అని ఎన్టీఆర్ అన్నారు. గతంలో ఎన్టీఆర్ను హేళన చేసిన రవితేజని కూడా ఆయన బాగుండాలని కోరుకున్నాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: