పవన్ కళ్యాణ్ తో పెళ్లి తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆయన నటించిన పలు సినిమాలకు రేణు దేశాయ్ వర్క్ చేసింది. చాలాకాలం తర్వాత రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాల్లో ఒక కీలక పాత్రలో నటించింది .. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు రేణు దేశాయ్‌కు బద్రి సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి కానీ పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడిన తర్వాత ఆమె సినిమాలు చేసేందుకు ఇష్టపడలేదట .. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించి ఓ అరుదైన అవకాశాన్ని చేతులారా వదులుకుంది. మహేష్ బాబు కెరియర్ లోనే మురారి సినిమాకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఆగే తన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ మురారి సినిమాకి ఉన్న క్రేజ్ వేరు..
ఇక రీసెంట్గా మహేష్ బాబు పుట్టినరోజు కనకగా మురారిని రిలీజ్ చేయక ఇప్పుడు కూడా ప్రేక్షకులను అదే స్థాయిలో మెప్పించింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా రేణు దేశాయ్న్ని సంప్రదించారట దర్శకుడు కృష్ణవంశీ.. అయితే ఆమె మనసులో ఈ సినిమా చేయాలని ఉన్నప్పటికీ కూడా సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకుందట. తర్వాత హిందీ నుంచి సోనాలి బింద్రే అని ఈ సినిమా కోసం హీరోయిన్గా తీసుకున్నారు. కేవలం ఈ చిత్రం మాత్రమే కాదు, ఎన్నో మంచి అవకాశాలను ఆమె అప్పట్లో వదులుకుందట.ఒకవేళ రేణు దేశాయ్ అలాగే హీరోయిన్ గా కొనసాగి ఉంటే ఈరోజు ఆమె రేంజ్ మరోలా ఉండేదని అంటున్నారు. ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది.ఇక నుంచి ఆమె సినీ కెరీర్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి మరీ.