అమల బిహేవ్ చేసిన పద్ధతి ఏమాత్రం బాగోలేదు అంటూ మండిపడిపోతున్నారు నాగచైతన్య ఫ్యాన్స్ . దానికి కారణం అక్కినేని అమల సవతి తల్లి అంటూ ప్రూవ్ చేసి మరి నాగచైతన్యని ఇబ్బంది పెడుతూ ఉంది అని వార్తలు వినిపించడమే . దానికి పక్కా ప్రూఫ్ తో కూడా నాగచైతన్య ఫ్యాన్స్ అమలను బాగా ట్రోల్ చేస్తున్నారు . మనకి తెలిసిందే బ్యాక్ టు బ్యాక్ అక్కినేని ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అసలు పెళ్లి చేసుకోడు అనుకున్న నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ళను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు.


వీళ్ళ నిశ్ఛితార్ధం జరిగింది . డిసెంబర్ 4వ తేదీ పెళ్లి కూడా జరగబోతుంది.  అయితే ఇంతలోపే నాగచైతన్య బ్రదర్ అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు నాగార్జున.  బడా వ్యాపారవేత్త కూతురు జైనబ్ రివ్జీ  తో అఖిల్ పెళ్లి జరగబోతుంది అంటూ అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.  జనవరి లో వీళ్ళ పెళ్లి జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . అయితే నాగచైతన్య సొంత కొడుకుని ఒకలా నాగచైతన్య ను ఒకలా చూస్తుంది అంటూ వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి .



దానికి కారణం నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ళ నిశ్చితార్ధం జరిగితే అమల ఒక్క పోస్టు కూడా పెట్టలేదు అని .. నాగార్జున మాత్రమే శోభిత ధూళిపాళ్లను కోడలుగా యాక్సెప్ట్ చేశారు అని అమల కేవలం ఫోటోకి ఫోజులిచ్చిందని .. అదే కొడుకు ఎంగేజ్మెంట్ కి సంబంధించి మాత్రం ఇన్స్టా స్టోరీ లో పోస్ట్ చేసింది అని మండిపడుతున్నారు . మరికొందరు మాత్రం అమల సోషల్ మీడియాని చాలా తక్కువగా వాడుతుంది అంటుంటే.. పెద్ద కొడుకు కోసం రాని సోషల్ మీడియా చిన్న కొడుకుని ఉపయోగించడానికి వచ్చిందా..? అంటూ ఘాటుగా బదులిస్తున్నారు. మొత్తానికి అక్కినేని ఫ్యామిలీలో ఈ సోషల్ మీడియా  కొత్త చిచ్చులు పెట్టి పెద్ద పెంటపెంట చేసేసింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: