తాప్సి రెగ్యులర్గా ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ నిరంతరం వార్తలలో నిలుస్తూ ఉంటుంది.. ముఖ్యంగా తన కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ఎంతో ఇబ్బంది పడ్డానని అందుకు కారణం వారసులకు దక్కినంత అవకాశాలు బయట నుంచి వచ్చే వారికి లభించలేదని తెలియజేసింది. ప్రస్తుతం అయితే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న తాప్సి.. గడిచిన కొన్ని నెలల క్రితం సైలెంట్ గా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.
తాజాగా తాప్సి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాధారణంగా పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా చావడం నీ తప్పే అనే విషయాన్ని చాలామంది మనతో చెబుతూ ఉంటారు.. తాప్సి కూడా తాను రిచ్ గా చనిపోవాలనుకోలేదని కానీ ఉన్నంతకాలం రిచ్ గా ఉండాలని మాత్రం కోరుకుంటున్నానని తెలిపింది. అయితే తాను సంపాదించినది తన తరువాత తరాలకు కాకుండా తానే రిచ్ గా జీవితాన్ని అనుభవించాలని తెలియజేసింది. అందుకే తాను బతికున్నంత కాలం చాలా సంతోషంగా, సుఖంగా ఉండడం కోసమే ఖర్చు చేయాలనుకుంటున్నారని తెలియజేసింది. ఇక చాలామంది సెలబ్రిటీలు కూడా ఎంతో సంపాదించిన సింపుల్ గా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. తమ తరాలకు ఆస్తులను కూడా పెడుతూ ఉంటారు. ఎవరైనా సరే తమ కష్టంతోనే సంపాదించుకోవాలని అప్పుడే కష్టం విలువ తెలుస్తుందని తెలియజేసింది తాప్సి.