కానీ అమితాబచ్చన్ మాత్రం సోషల్ మీడియాలో తమ కుటుంబం పైన జరుగుతున్న దుష్ప్రచారం నీ ఖండించడం జరిగింది..అయితే ఇటీవలే దుబాయిలో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో ఐశ్వర్యరాయ్ పేరును స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం జరిగిందట. ఇందులో ఇంటి పేరుపైన బచ్చన్ కనిపించకపోవడంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యపోయారు. దీంతో నిజంగానే ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ నుండి విడాకులు తీసుకుందా అనే విషయాలకు మరింత బీజం వేసినట్టుగా కనిపిస్తోంది.
దుబాయ్ ఈవెంట్లో స్క్రీన్ పైన ఐశ్వర్యరాయ్ బచ్చన్ అనే పేరును ఎందుకు తొలగించారని ప్రశ్న ఇప్పుడు అభిమానులలో సందేహంగా మారింది. లేకపోతే ఇది ఐశ్వర్యారాయ్ కి తెలియకుండానే జరిగిపోయిందా అన్నట్లుగా అభిమానులు లాజిక్కులు వెతుక్కుంటున్నారు. ఇటీవల దుబాయ్ లో గ్లోబల్ వుమెన్ ఫోరమ్ వేడుకలలో ఈ విషయాన్ని అభిమానులు గుర్తించారు. ఐశ్వర్యారాయ్ పేరు మారడం పైన అందరూ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుకలలో ఐశ్వర్యారాయ్ స్త్రీల ఆత్మాభిమానం గురించి చాలా గొప్పగా మాట్లాడాలని అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.. అలా ఐశ్వర్యరాయ్ ఒకవైపు మాట్లాడుతూ ఉండగానే మరొకవైపు పేరులో బచ్చన్ పేరు కనిపించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఏంటన్నది అటు ఐశ్వర్య కానీ ఇటు అభిషేక్ గాని క్లారిటీ ఇస్తారేమో చూడాలి.