చాలా మంది సినీ సెలబ్రిటీలు మరణించిన తర్వాత కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటారు. అలా తాజాగా శ్రీదేవి పై కూడా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విలన్ గా.. సినీ రచయితగా.. చేసిన ఓ సెలబ్రిటీ కూడా సంచలన కామెంట్స్ చేశారు. ఆమె పెద్ద తాగుబోతు అంటూ ఆ రచయిత చేసిన కామెంట్లు మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇంతకీ శ్రీదేవిని తాగుబోతు అని అవమానించింది ఎవరో కాదు సినిమాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే రచయితగా పనిచేస్తున్న తోటపల్లి మధు.. ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. శ్రీదేవి హై డయాబెటిక్.. అయితే ఆమెకు నటన మీద అందం మీద పిచ్చి ఉండి ఎన్నో ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది. అలాగే ఎప్పటికీ ఒకే రకమైన ఫిజిక్ మెయింటైన్ చేయడానికి తక్కువ తినేది.ముఖ్యంగా ఫుడ్ కంటే ఎక్కువగా జ్యూస్ లే తాగేది. తిండి తింటే ఎక్కడ బరువు పెరుగుతానో అని భయపడేది.

 ఇక 55 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో మరణించిన  శ్రీదేవికి తన కూతుర్లు పెద్దయ్యాక సినిమాల్లో ఎలా రాణిస్తారు.. తన కూతుర్ల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ప్రతిసారి ఆలోచించేది. అంతేకాదు బోనీ కపూర్ శ్రీదేవి ఆమె ఇద్దరు కూతుర్లకు కలిపి రోజుకు లక్ష వరకు ఖర్చు పెట్టేవారు.అందం కోసం శ్రీదేవి చేయని పని అంటూ లేదు.కేవలం హిందీ,తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ వంటి భాషల్లో కూడా నటించడం వల్ల అవకాశాలు ఎక్కువగా ఉన్న సమయంలో శ్రీదేవి ఎక్కువ సమయం పని చేయాల్సి వచ్చేది. ఆ టైంలో మద్యపానం అలవాటయింది.అలా అలవాటు కాస్త వ్యసనంగా మారిపోయింది. ఆమె చనిపోయే రోజు రాత్రి కూడా మందు తాగింది.కానీ ఆ టైంలో బోని కపూర్,పిల్లలు పక్కన లేరు.

ఇక బోనీ కపూర్ శ్రీదేవి వేసుకునే టాబ్లెట్స్ ఫోన్ చేసి మరీ గుర్తు చేస్తూ ఉంటారు.కానీ ఆ రోజు శ్రీదేవి ఫోన్ చార్జింగ్ పెట్టడం మర్చిపోయింది.దాంతో బోనికపూర్ ఫోన్ చేస్తే కలవకపోవడంతో వెంటనే శ్రీదేవి రూమ్ కి వచ్చి టాబ్లెట్స్ గుర్తు చేశారు. కానీ అప్పటికి తాగుతూ ఉన్న శ్రీదేవి బాత్రూంకి వెళ్లి బాత్ టబ్ లోనే స్పృహ తప్పి పడిపోయింది.అలా 14 నిముషాలు కోమాలోకి వెళ్లి 14 నిమిషాలకే చనిపోయింది. ఇక శ్రీదేవి సావిత్రి మరణం రెండూ ఒకటే.కానీ సావిత్రి 14 నెలలు కోమాలోకి వెళ్లి చనిపోతే శ్రీదేవి మాత్రం 14 నిమిషాలకే మరణించింది.రిచ్ శ్రీదేవి పూర్ సావిత్రి లాగే మందు తాగి మరణించింది.. అంటూ మరణించిన శ్రీదేవి పై షాకింగ్ కామెంట్లు చేశారు..ఇక రచయిత తోటపల్లి మధు మాట్లాడిన మాటలపై శ్రీదేవి అభిమానులు ఫైర్ అవుతున్నారు. చనిపోయిన హీరోయిన్ పై ఏంటా మాటలు అంటూ తిట్టిపోస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: