గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన వరుడు సినిమాలో హీరోగా చేసిన అల్లు అర్జున్ అతిపెద్ద ఫ్లాప్ ను మూట కట్టుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ గుణశేఖర్ దర్శకత్వం చేసిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర చేయడానికి ముందుకు వచ్చారు. ముఖ్యంగా అప్పటికే బడ్జెట్ ఎక్కువైపోయిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రని ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే ఫ్రీగా చేసేసారట అల్లు అర్జున్. మరి ఈ సినిమా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

 కాకతీయ వంశ చరిత్రలో ఒక ధ్రువతారల వెలుగొందిన మహారాణి రుద్రమదేవి కి సంబంధించి ఎన్నో అద్భుతమైన విషయాలను రుద్రమదేవి సినిమాలో చూపించారు డైరెక్టర్ గుణశేఖర్. 2017 అక్టోబర్ 9న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమాలో మెయిన్ రోల్ లో రుద్రమదేవిగా అనుష్క నటించగా.. గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించారు. చాళుక్య వీరభద్ర పాత్రలో దగ్గుబాటి రానా, గణపతి దేవుడు పాత్రలో సీనియర్ నటుడు కృష్ణంరాజులు నటించారు. అలాగే నిత్యమీనన్, కేథరిన్,ప్రకాష్ రాజ్, సుమన్ లు కూడా కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాలో అందరికంటే ఎక్కువగా అట్రాక్ట్ చేసింది గోన గన్నారెడ్డి పాత్ర. అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్రకి చరిత్రలో ఒక మంచి స్థానం ఉంది. అయితే ఈ పాత్ర ప్రాముఖ్యత ఏంటో తెలుసుకొని స్వయంగా వచ్చి అల్లు అర్జున్ చేస్తానని చెప్పారట.


ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ చెప్పే డైలాగులు ఆయన కటౌట్ ప్రేక్షకులను అలరించిందని చెప్పుకోవచ్చు. గమ్మునుండవోయ్ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ కి థియేటర్లలో అభిమానులు ఈలలు వేశారు. ఇక అల్లు అర్జున్ సినిమాలో చెప్పే తెలుగు భాష లెక్కా నేను ఆడా ఉంటా ఈడా ఉంటా అనే డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. అయితే ఈ పాత్ర కోసం మొదట డైరెక్టర్ మహేష్ బాబు, ఎన్టీఆర్ లను అనుకున్నట్టు టాక్ వినిపించింది. కానీ ఈ గోన గన్నారెడ్డి పాత్రకి అల్లు అర్జున్ తప్ప ఎన్టీఆర్, మహేష్ బాబులు పూర్తి న్యాయం చేసేవారు కాదు అని ప్రేక్షకుల అభిప్రాయం. ఎందుకంటే ఈ పాత్రలో అల్లు అర్జున్ ఎంతలా ఒదిగిపోయి నటించారో చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఈ గోన గన్నారెడ్డి పాత్ర రుద్రమదేవి సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఉన్న అల్లు అర్జున్ రుద్రమదేవి సినిమాలో గెస్ట్ రోల్ చేయడం అనేది మామూలు విషయం కాదు

మరింత సమాచారం తెలుసుకోండి: