* తెలుగు సినిమాలో బాలీవుడ్ హీరోల గెస్ట్ అప్పియరెన్స్

* హైలెట్ అయిన సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్  

* ఫాదర్ సక్సెస్ లో సల్మాన్ బాయ్ కీలక రోల్‌

( తెలంగాణ - ఇండియా హెరాల్డ్)

ఇటీవల కాలంలో స్టార్ హీరోలు ఇతర హీరోల సినిమాల్లో రోల్స్ చేయడం కామన్ అయిపోయింది. సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ సినిమాలో అలానే గెస్ట్ రోల్ పోషించి అలరించాడు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య డిజాస్టర్ తరువాత మలయాళంలో హిట్ అయిన లూసిఫర్‌ని రీమేక్ చేయడం ద్వారా సేఫెస్ట్ చాయిస్ ఎంచుకున్నారు.  తెలుగు వెర్షన్, గాడ్ ఫాదర్, అనేక ట్విస్టులతో మంచి పొలిటికల్ థ్రిల్లర్‌లా నిలిచింది. ఈ సినిమా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకస్మిక మరణంతో కథ ప్రారంభమవుతుంది. దీంతో సీఎం స్థానం ఖాళీ అవడంతో రాజకీయ పోరు మొదలవుతుంది. దివంగత సీఎం అల్లుడు జై (సత్యదేవ్), కూతురు సత్య (నయనతార) ఇద్దరూ అగ్రస్థానానికి పోటీ పడతారు. అయితే, వారి ప్లాన్లను అడ్డుకునేందుకు పార్టీలో బలమైన, ప్రభావవంతమైన నాయకుడు బ్రహ్మ (చిరంజీవి) ప్రయత్నిస్తుంటాడు. ప్రతి పాత్ర ముఖ్యమంత్రి కుర్చీని దక్కించుకోవడానికి ఇస్తుంటారు. ఈ స్టోరీ చాలా థ్రిల్లింగ్ గా నడుస్తుంది.

ఇక ఇందులో సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ సినిమాకి పెద్ద హైలెట్ అని చెప్పవచ్చు. పర్ఫెక్ట్ టైమ్‌లో ఈ బడా బాలీవుడ్ హీరో ఎంట్రీ ఇస్తాడు. దాంతో థియేటర్లలో ఈలలు మోగాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్, సాంగ్ సీక్వెన్స్‌లో చిరంజీవితో సల్మాన్ చేసే సన్నివేశాలు ఫుల్ ఎనర్జీతో ఉంటాయి. ఈ మూమెంట్స్ ఊర మాస్ అని చెప్పుకోవచ్చు.

రీమేక్స్‌ తీస్తూ హిట్స్ అందుకునే మోహన్ రాజా తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా పలు మార్పులు చేశారు. కథను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చాడు. ముఖ్యంగా సల్మాన్ సీన్లను చాలా చక్కగా రాసుకున్నాడు గెస్ట్ రోల్ అని పేరే కానీ ఈ పాత్ర సూపర్ గా హైలెట్ అయింది. మోహన్ రాజా చిరంజీవి ప్రతిభను కూడా బాగా ఉపయోగించుకున్నాడు. చిరంజీవి ఎమోషన్స్ డైలాగ్స్ అదిరిపోయాయని చెప్పుకోవాలి. మొత్తం మీద గాడ్ ఫాదర్ మూవీ బ్లాక్ బస్టర్ పొలిటికల్ థ్రిల్లర్ లా నిలిచింది సల్మాన్ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ సూపర్ సక్సెస్ అయ్యింది. సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్ సన్నివేశాలు ఆడియన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: