మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులలో మంచి క్యూరియాసిటీని పెంచాయి. ఆగస్టు 15న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ముందుగానే ప్రీమియర్ షోలు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సినిమాకు హరిశంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు మొదటి నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.


2018లో హిందీలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా రైడ్ కి రీమేక్ గా మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా చేసింది. అంతేకాకుండా ఈ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ ఓ కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. తాజా సమాచారం ప్రకారం మాస్ మహారాజా రవితేజసినిమా నిర్మాతలకు ఏకంగా నాలుగు కోట్లు వెనక్కి ఇచ్చేసాడని సమాచారం.


అంతేకాకుండా దర్శకుడు హరీష్ శంకర్ కోటిన్నర నుంచి రెండు కోట్లు వెనక్కి ఇచ్చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాకి వచ్చిన నష్టాలలో స్వల్ప మొత్తంలో అయితే నష్టాలను తీర్చినట్లు అవుతుందని వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారట. కాగా, ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మాణం వహించారు. మరి ఈ సినిమా దాదాపు 20 కోట్ల లోపు వరల్డ్ వైడ్ గా బిజినెస్ ని జరుపుకోగా.... ఇందులో సగం షేర్ అంటే 10 కోట్ల షేర్ అని కూడా ఈ సినిమా రాబట్టలేదని ట్రేడ్ వర్గాల్లో సమాచారం ఉంది.


మరి ఈ సినిమాలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించినప్పటికీ ఈ సినిమా వర్కౌట్ కాలేదు. పైగా ఈ సినిమా విడుదలయ్యాక దారుణమైన నెగిటివిటిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనివల్ల కూడా సినిమాపై ఉన్న కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఆడియన్స్ లో తగ్గిపోయింది. ఈ సినిమా పరంగా ఎవరికైనా లాభం చేకూరింది అంటే అది కేవలం హీరోయిన్ భాగ్యశ్రీ కి మాత్రమే. ఈ సినిమా అనంతరం ఈ బ్యూటీ వరుస పెట్టి సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: