మరి ఇంతకీ అయన కెరియర్ లో ఒక్క మూవీ మాత్రం ఎంతో స్పెషల్ .. అదే త్రిమూర్తులు .. వెంకటేష్ హీరోగా ఈ సినిమా వచ్చింది .. ఈ సినిమాలో అర్జున్ , రాజేంద్రప్రసాదులు కూడా హీరోలుగా నటించారు .. ఇది ఒక మల్టీస్టారర్ మూవీ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో బాలయ్య గెస్ట్ రోల్ లో కనిపిస్తారు. కె మురళీ మోహన్‌రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1987లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా మన తెలుగు చిత్ర పరిశ్రమ లోనే ఎంతో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. చిరంజీవి , నాగార్జున కూడా ఈ సినిమాలో గెస్ట్ లగా మెరిశారు. వీరందరితో పాటు తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఇందులో మెరిసింది. కృష్ణ , శోభన్ బాబు , కృష్ణంరాజు , చంద్రమోహన్ , మురళీమోహన్ పరుచూరి బ్రదర్స్ , గొల్లపూడి , పద్మనాభం , విజయశాంతి , రాధ , భానుప్రియ రాధికతో పాటు శారదా , జయమాలిని , అనురాధ , వై విజయ వంటి వారు కూడా గెస్ట్లుగాా నటించారు.
ఇలా చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ స్టార్స్ అంత ఇందులో గెస్ట్లుగా మెరిశారు. అలా ఈ సినిమా చాలా ప్రత్యేకతని సంతరించుకుంది. అలాగే చిరంజీవి , నాగార్జున , బాలయ్య , వెంకటేష్ వంటి నలుగురు స్టార్ హీరోలు నటించిన ఒకే ఒక్క సినిమా త్రిమూర్తులు కావటం ఇక్కడ మరో విశేషం. అయితే ఈ సినిమా అప్పట్లో పెద్దగా ఆడలేదు. ఇంత పెద్ద భారీ క్యాస్టింగ్ ఉన్న సినిమాలో విషయం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. హిందీలో వచ్చిన నసీబ్ సినిమాకి ఇది రీమేక్ గా ఇక్కడ తెరకెక్కించారు. బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా విజయం సాధించింది .. తెలుగులో మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో తన 19వ సినిమా డాకు మహారాజు్ లో నటిస్తున్నాడు. ఇక వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు.