మెగా ప్రిన్స్ వరుణ్ బిగ్ డిసిషన్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది .. వరుస ఫెయిల్యూర్స్ తో  కెరియర్ ఇబ్బందుల్లో పడటంతో ప్రస్తుతం సినిమాలుకు బ్రేక్ ఇవ్వబోతున్నారట .. భారీ ఆశ‌లు పెట్టుకున్న పాన్ ఇండియా మూవీ మట్కా కూడా డిజాస్టర్ అవ్వడంతో ఈ సంచల నిర్ణయం తీసుకున్నారట వరుణ్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు టైం  అసలు ఇప్పుడు కలిసి రావటం లేదు .. దాదాపు ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ యంగ్ హీరో ..  2019లో వచ్చిన గద్దల కొండ గణేష్ వరుణ్ చివరి హిట్ ..


ఇక తర్వాత ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తున్న ఏ ఫార్ములా కూడా వరుణ్ కు అసలు కలిసి రావడం లేదు. గద్దల కొండ  గణేష్ తర్వాత ఐదు సినిమాల్లో నటించాడు .. కామెడీ , స్పోర్ట్స్‌ డ్రామా , స్పై యాక్షన్ , ఏరియల్ యాక్షన్ , పీరియాడిక్ ఇలా ఎన్నో డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు .. కానీ ఏ జోనర్ లోను ఆయనకు హిట్ రాలేదు .. వరుస అపజయాలతో కెరియర్ ఇప్పుడు మరింత కష్టాల్లోకి వెళ్లిపోయింది . గని సినిమాతో మొదలైన ఈ బ్యాడ్ సెంటిమెంట్ వరుణ్ కి అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది .. హిట్ ఫార్మాల‌ తో వచ్చిన ఎఫ్ 3 కూడా నిరాశపరిచింది .


 స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన గాండీవ దారి అర్జున , ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు మినిమం బజ్ కూడా క్రియేట్ చేయలేకపోయి.. ఇక తాజాగా వచ్చిన మట్కా సినిమాతో మరోసారి తన ఫెయిల్యూర్ సెంటిమెంట్ ను కంటిన్యూ చేశాడు వరుణ్ .. పీరియాటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మినిమం కలెక్షన్లు కూడా రాబట్లేకపోయింది .. దీంతో కొద్ది రోజులు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని వరుణ్ నిర్ణయం తీసుకున్నారట. ఆడియన్స్ను మెప్పించే కథతో థియేటర్లోకి రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఈ మెగా హీరో.

మరింత సమాచారం తెలుసుకోండి: