ఎన్నో ఏళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అవి పుకార్లు గానే మిగిలిపోయాయి. అయితే ఇక నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది అన్న విషయం అర్థమైపోయింది. ఎందుకంటే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి మూవీ చేయబోతున్నాడు అనే విషయంపై ఇప్పటికే అటు అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఇక ఈమూవీ గురించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. అయితే ఇక ఇలా మోక్షాజ్ఞ మొదటి మూవీ ఎలా ఉండబోతుందో అని అంచనాలు పెరుగుతున్న వేళ ఇక రెండో సినిమాకు కూడా సైన్ చేసేసాడట బాలయ్య వారసుడు.
ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం వరుసగా సూపర్ హిట్లతో దూసుకుపోతున్న దర్శకుడు వెంకీ అట్లూరితో అటు మోక్షజ్ఞ రెండో సినిమా ఉండబోతుంది అని సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నట్లు ఒకటాక్ సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. కాగా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఇటీవలే అటు దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ అనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఇకపోతే ప్రస్తుతం మోక్షజ్ఞ - ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ రెగ్యులర్ షూటింగ్ జనవరి మొదటి వారంలో ప్రారంభం కాబోతుంది అన్నది తెలుస్తుంది..