త్రీ మూవీ రి రిలీజ్:
ధనుష్, శృతిహాసన్ కాంబినేషన్లో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన త్రీ సినిమా అందరూ చూసే ఉంటారు.ఈ సినిమాల్లో ధనుష్ శృతిహాసన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చూసేవారిని ఆకట్టుకుంటాయి. ఇక ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించడంతోపాటు నిర్మాతగా కూడా చేసింది. అలా 2012లో విడుదలైన త్రీ సినిమా రొమాంటిక్ సైకాలజీకల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో మొదటి రెండు మూడు రోజులలోనే డిజాస్టర్ అని టాక్ వచ్చింది.అయితే ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ సినిమాలోని పాటలు మాత్రం చాలా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ చేశారు.