వరల్డ్ వైడ్ గా 1000కి పైగా థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. మురారి సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి రోజు భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా దీనికి రికార్డులు బ్రేక్ చేసే రేంజ్ లో వసూళ్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే రెండో రోజు, మూడో రోజు కూడా మురారి సినిమా తన సత్తాను చాటుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ. 7 కోట్లకు పైనే గ్రాస్ వసూలు అయింది. మురారి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభించింది.
దీంతో నాలుగు రోజుల్లో నైజాంలో రూ. 50 లక్షలు, ఆంధ్రాలో రూ. 1.77 కోట్లతో కలిపి రూ 7.17 కోట్ల గ్రాస్ వచ్చింది. అంతేకాకుండా కర్ణాటక ప్లేస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 65 లక్షలు, ఓవర్సీస్ లో రూ. 70 లక్షలు వసూలు అయ్యాయి. ఇలా నాలుగు రోజులలో రూ. 8.52 కోట్ల గ్రాస్ లభించింది.
ఇప్పటి వరకు తెలుగు లో రీరిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలలో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి 7.76 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. బిజినెస్ మెన్ 5 కోట్ల 90 లక్షలతో రెండవ ప్లేస్ లో ఉంది. ఇక మురారి సినిమా మూడవ స్థానాన్ని దక్కించుకుంది. దీంతో ఈ విషయం తెలిసిన మహేష్ బాబు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.