మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నా ఇంద్ర సినిమా ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. ఇంద్ర సినిమా బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. కొంతకాలం క్రితం ఇంద్ర మూవీ రీరిలీజ్ కాగా ఆ సమయంలో ఈ సినిమా సత్తా చాటిందనే చెప్పాలి. ఈ సినిమాకు 4 కోట్ల రూపాయల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు రావడం గమనార్హం.
 
మెగాస్టార్ చిరంజీవి హవా ఏ మాత్రం తగ్గలేదని ఈ సినిమాతో ప్రూవ్ అయింది. ఇంద్ర సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని క్రేటీ ప్రాజెక్ట్ లు రీరిలీజ్ కానున్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చిరంజీవి ప్రస్తుతం భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. విశ్వంభర సినిమాతో కచ్చితంగా సక్సెస్ అందుకోవాల్సిన బాధ్యత చిరంజీవిపై ఉంది.
 
మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలకు సంబంధించిన లుక్స్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారనే సంగతి తెలిసిందే. విశ్వంభర సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది. బింబిసార సినిమాతో మ్యాజిక్ చేసిన మల్లిడి వశిష్ట విశ్వంభర సినిమాతో అంతకు మించిన మ్యాజిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.
 
విశ్వంభర సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ కు సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందో కాదో తెలియాల్సి ఉంది. విశ్వంభర సినిమా కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించి వేర్వేరు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం సంక్రాంతి పండుగ సమయంలో ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది. చిరంజీవి తర్వాత సినిమాలతో రికార్డులు క్రియేట్ చేస్తారేమో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: