ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలో కెరియర్ లో ఎవర్ గ్రీన్ గా నిలిచిన ఎన్నో సినిమాలని నిర్మాతలు రిలీజ్ చేస్తున్నారు. అటు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలను చూసేందుకు థియేటర్లకు బారులు తీరుతున్నారు. దీంతో అప్పటికే చూసిన సినిమా అయినప్పటికీ రీ రిలీజ్ లలో కూడా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇక అప్పట్లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇక ఇప్పుడు కూడా రీ రిలీజ్ లలో భారీగా వసూళ్లు సాధిస్తూ ఉండడం గమనార్హం.


 ఇలా రీ రిలీజ్ అయిన సినిమాలలో సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా కూడా ఒకటి. ఇది తెలుగు సినిమా కాదు తమిళ డబ్ సినిమా. దీనిని చేయాలి అనుకోవడం ఇక సాహసం. కానీ టాలీవుడ్ లో అటు సూర్యకి ఉన్న క్రేజ్ దృశ్య నిర్మాతలు నమ్మకం ఉంచి ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే 15 ఏళ్ల క్రితం ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కానీ.. రీ రిలీజ్ కలెక్షన్స్ మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచాయి అని చెప్పాలి. ఇక ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి అటు హీరో సూర్య కూడా షాక్ లో మునిగిపోయి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసాడు. ఏకంగా ఈ సినిమాలోని పాటలకు అటు థియేటర్లో ప్రేక్షకులు అందరూ కూడా డాన్సులు కూడా వేసేశారు. దీంతో వారాంతంలో ఏకంగా ఈ సినిమా ఐదు నుంచి 6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది అని చెప్పాలి.



 మొదటి రోజే ఏకంగా 24 వేల టికెట్స్ అమ్ముడు అయ్యాయి. ఇక ఈ సినిమాలోని కథ ఒక ఎత్తైతే సినిమాకు హరీష్ జయరాజ్ అందించిన సంగీత మరో ఎత్తు అని చెప్పాలి. ఇక ఈ సినిమాలోని చంచల అనే పాట అయితే మరోసారి ప్రేక్షకుల మదిని దోచేసింది అని చెప్పాలి. ఇలా కనీసం థియేటర్లకు ప్రేక్షకులను రాబట్ట గలదా లేదా.. ఇది తమిళ సినిమా తెలుగు ప్రేక్షకులు పట్టించుకుంటారా అనే అనుమానాల మధ్యదాదాపు 15 ఏళ్ల తర్వాత విడుదలైన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా మరోసారి సూపర్ హిట్గా నిలిచింది అని చెప్పాలి. ఇలా టాలీవుడ్ రీ రిలీజ్ హిట్ సినిమాలలో సూర్య సన్నాఫ్ కృష్ణన్ కూడా చేరిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: