మరి ముఖ్యంగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు తీసి హిట్టు కొట్టడంలో వెంకటేష్ ను మించిన హీరో టాలీవుడ్ లో లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వెంకటేష్ కెరియర్ లో ఉన్న సూపర్ హిట్ సినిమాలలో ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే మూవీస్ కొన్ని ఉన్నాయి. అలాంటి సినిమాలలో చంటి సినిమా కూడా ఒకటి. అమాయకమైన అబ్బాయిగా ఆ సినిమాలో వెంకటేష్ నటన ప్రతి ఒక్కరిని కూడా ఫిదా చేసేసింది. ఇక ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమాలో మీనా వెంకటేష్ సరసన హీరోయిన్గా నటించింది. 1992 జనవరి 10 సంక్రాంతి కానుకగా విడుదలై ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది ఈ మూవీ.
అయితే ఇక ఈ సినిమాలో వెంకటేష్ తప్ప మరొకరు నటించి ఉంటే సినిమా హిట్ అయ్యేది కాదు అని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. కానీ డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి మాత్రం ఈ సినిమాలో వెంకటేష్ కంటే ముందే మరో హీరోని పెట్టుకోవాలని అనుకున్నాడట. తమిళంలో చిన్న తంబి అనే పేరుతో తెరకెక్కి సూపర్ హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని రవిరాజా పినిశెట్టి అనుకున్నాడట. ఈ మూవీలో మొదట హీరోగా రాజేంద్ర ప్రసాద్ ను తీసుకోవాలని అనుకున్నారట. కానీ మెగాస్టార్ చిరంజీవి మీడియేటర్ గా వ్యవహరించి వెంకటేష్ అయితే బాగా సరిపోతాడని డైరెక్టర్ ను ఒప్పించి ఇక ఈ సినిమాలో వెంకటేష్ ని హీరోగా సెలెక్ట్ చేసేలా చేశాడట. ఇక ఆ తర్వాత ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.