అయితే మొన్నటి వరకు స్టార్ హీరోలు ఇలా పారితోషకం ఎంత పెంచినప్పటికీ అటు డైరెక్టర్లు మాత్రం ఇక తక్కువగానే పారితోషకం పుచ్చుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో అయితే డైరెక్టర్లు కూడా పారితోషకం విషయంలో తగ్గేదేలే అంటున్నారు. హీరోలతో పోటీపడి మరి అటు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారు అని చెప్పాలి. ఇలా పారితోషకాలతో అటు డైరెక్టర్లు కూడా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తి గురువును మించిన పారితోషకం తీసుకుంటున్నాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది.
ఆ డైరెక్టర్ ఎవరో కాదు అట్లీ. షారుక్ ఖాన్ తో జవాన్ సినిమా తీసి హిట్టు కొట్టిన అట్లీ పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నాడు. యంత్రన్, నాన్ సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఈయన 2013లో ఆర్య హీరోగా వచ్చిన రాజారాణి సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇక ఆ తర్వాత ప్రతి సినిమాతో హిట్టు కొట్టాడు. షారుక్ తో తీసిన జవాన్ సినిమా అయితే 1000 కోట్ల వసూళ్లు సాధించింది. ప్రస్తుతం తదుపరి సినిమా సల్మాన్ ఖాన్ తో చేయబోతున్నాడు. సల్మాన్ తో చేయబోయే సినిమాకి అట్లీ 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట. జవాన్ సినిమాకి 60 కోట్లు తీసుకున్న అట్లీ ఇప్పుడు జీతం రెట్టింపు చేశాడట. అయితే తన గురువు శంకర్ కేవలం 60 నుంచి 80 కోట్లు మాత్రమే తీసుకుంటుంటే.. ఇక శిష్యుడైన అట్లీ మాత్రం 100 కోట్లు తీసుకుంటూ ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో అట్లీ గురువును మించిన శిష్యుడు అయ్యాడు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.