ఈ వారం థియేటర్లలో విడుదలవుతున్న ఒకే ఒక భారీ బడ్జెట్ మూవీ పుష్ప ది రూల్ మాత్రమేననే సంగతి తెలిసిందే. సరిగ్గా 60 గంటల్లో పుష్ప ది రూల్ మూవీ థియేటర్లలో ప్రదర్శితం కానుండగా ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో అనే టెన్షన్ మేకర్స్ లో ఉంది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో అనే చర్చ సైతం జరుగుతోంది. నిడివి ఎక్కువగా ఉండటంతో పుష్ప2 మూవీ రోజుకు 6 గంటలు మాత్రమే ప్రదర్శితం కానుంది.
 
తెలంగాణలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా ఏపీలో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలియాల్సి ఉంది. తెలంగాణ స్థాయిలో ఏపీలో టికెట్ రేట్ల పెంపు రాకపోవడం వల్లే పుష్ప2 మూవీ బుకింగ్స్ ఆలస్యం అవుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ మూవీ టికెట్ రేట్లపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తుండటం గమనార్హం.
 
పుష్ప ది రూల్ మూవీకి ఏపీలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కు మధ్య గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ మూవీ ఈ ఏరియా ఆ ఏరియా అని లేకుండా అన్ని చోట్ల భారీ టికెట్ రేట్లతో రిలీజ్ అవుతుండటం గమనార్హం. 475 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
 
పుష్ప ది రూల్ రిలీజ్ సమయంలో నాగబాబు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మీరు తప్పు మార్గంలో వెళ్తుంటే వెంటనే మీ తప్పును సరిదిద్దుకోవాలని మీరు తప్పు మార్గంలోనే కొనసాగితే మాత్రం మీరు నిజంగా ఉన్న చోటికి తిరిగి రావడం కష్టమవుతుంది అని నాగబాబు పేర్కొన్నారు. ఈ పోస్ట్ బన్నీని టార్గెట్ చేస్తూ నాగబాబు చేసిన పోస్ట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: