మరి కొద్ది రోజుల్లోనే పుష్ప2 రిలీజ్ కాబోతుంది . అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్క హీరో కూడా దీనిపై ట్వీట్ చేసింది లేదు. నోరు విప్పి మాట్లాడింది లేదు . ఈ విషయంతో అర్థమైపోతుంది ఇండస్ట్రీలో మెగా వర్సెస్ అల్లు వార్ ఎంత హాట్ గా హిట్ పెంచేసిందో . అయితే మెగా ఫ్యామిలీ కారణంగా బన్నీ ఎంతో కష్టపడి నటించిన పుష్ప2 సినిమాకి నెగిటివ్ టాక్ రావడం ఉపాసనకి అస్సలు ఇష్టం లేదట . ఆ కారణంగానే ఉపాసన తన భర్త రామ్ చరణ్ అదే విధంగా మెగాస్టార్ చిరంజీవిలను డైరెక్ట్ గా అడిగేసిందట.
"సోషల్ మీడియాలో రకరకాల గొడవలు జరుగుతున్నాయి. దానివల్ల బన్నీ కెరియర్ కూడా స్పాయిల్ అవ్వచ్చు.. కష్టపడి నటించిన సినిమా ..మన ఫ్యామిలీ మధ్య గొడవలు లేవు అన్న విషయం క్లారిటీగా
ఫాన్స్ కి చెప్పేస్తే సరిపోతుంది కదా.. ఇలా మౌనం వహిస్తూ ఎంత టైం వేస్ట్ చేస్తారు.. పుష్ప 2 కి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు.. మన పరంగా నెగిటివ్ టాక్ రాకూడదు కదా " అంటూ లీడ్ తీసుకొని మరి ఉపాసన తన భర్త మామలనే ఎదిరించిందట. ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే నిజంగా ఉపాసన అలా చేసి ఉంటే మాత్రం చాలా గ్రేట్ అంటున్నారు బన్నీ అభిమానులు . ఎవరు పట్టించుకోని మూమెంట్లో ఉపాసన ఇలా లీడ్ తీసుకొని మరి బన్నీ కోసం సపోర్ట్ చేయడం అది కూడా తన సొంత భర్త - మామని ఎదిరించే విధంగా మాట్లాడడం.. ఆమె నిజాయితీకి నిదర్శనం అంటున్నారు . ఆ విషయంలో ఉపాసనకి చేతులెత్తి దండం పెట్టాలి అంటూ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు..!