శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకి హైలైట్ అని చెప్పాలి . పాటలోని లిరిక్స్ కూడా అద్భుతంగా రాశారు. కాగా ఈ పాటలోని స్టెప్స్ కొన్ని కొన్ని చాలా ఆహ్లాదకరంగా నాటీగా ఉంటే మరికొన్ని టూ బోల్డ్ గా వల్గర్ గా ఉన్నాయి అంటూ అప్పుడే సోషల్ మీడియా ట్రోలింగ్ చేయడం ప్రారంభించేశారు. మరి ముఖ్యంగా రష్మిక మందన్నా కాళ్లు పట్టుకొని అల్లుఅర్జున్ వేసే స్టెప్ చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది అని అంటున్నారు. పాన్ ఇండియా లాంటి స్టార్ హీరో ఇలా హీరోయిన్ కాళ్లు పట్టుకొని ఆ స్టెప్ వేయడం ఏంటి ..? అంటూ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు .
మరికొందరు పాటలోని కొన్ని స్టెప్స్ ని ఇంకా డబల్ మీనింగ్ లో చూడటం పనిగా పెట్టుకున్నారు . రష్మిక మందన్నా - అల్లు అర్జున్ పైకి ఎక్కి వేసిన స్టెప్ చాలా ఇబ్బందికరంగా ఉంది అంటూ.. ఒక అమ్మాయి ఏంటి అలా ఎక్కి మీదికి స్టెప్స్ వేయడం కాళ్లు అలా అలా ఊపుతూ ఉండడం .. చాలా చాలా అసహ్యంగా ఉంది అంటూ ట్రోల్ చేస్తున్నారు . అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం అలాంటి వాళ్లకు గట్టిగా బదులిస్తున్నారు . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో పుష్ప2 పై ఒక విధంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు పాటలోని స్టెప్స్ బాగున్న ట్రోల్ చేస్తున్నారా? ఎవరు ఎన్ని ట్రోల్ చేసిన పుష్ప2ని అడ్డుకునే ప్రసక్తేలే ..మేము తగ్గేదే లే.. సినిమా సూపర్ డూపర్ హిట్ 1500 కోట్లు పక్క.. రాసి పెట్టుకోండి అంటూ ఓపెన్ సవాళ్లు విసురుతున్నారు. కాగా పీలింగ్స్ పాట జనాలకి నచ్చడం పై సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఈ పాట ధియేటర్స్ లో చూస్తే మీకు పూనకాలు గ్యారెంటీ అంటూ పోస్ట్ చేసింది..!