టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యుఫోరియా, హైప్ ఉండేదో పక్కన పెడితే… ఓజీ సినిమాపై మాత్రం ఒక స్థాయిని మించిన అంచనాలున్నాయి. కేవలం ప్రీ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై వేల కోట్ల అంచనాలు క్రియేట్ చేశాడు సుజీత్. ఇక ఒక్క గ్లింప్స్‌తో కేవలం టాలీవుడ్‌ను మాత్రమే కాదు.. యావత్ ఇండియాను ఒక ఊపు ఊపేశాడు. పవన్‌ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా.. అభిమానులు మాత్రం కాస్త ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకుంది ఓజీ సినిమాపైనే.అర్థం చేసుకోలేక ఫ్లాప్‌ చేశామే కానీ.. సాహో సినిమా రేంజ్‌ వేరన్నది ఎందరో అన్న మాటలు. అలాంటి సుజీత్‌ నుంచి ఐదేళ్ల తర్వాత సినిమా, అది కూడా పవన్‌ కళ్యాణ్‌తో అంటే అంచనాలు ఖచ్చితంగా తారా స్థాయిలోనే ఉంటాయి.ఈ క్రమంలో రిలీజ్ డేట్ సంగతి పక్కన పెడితే... ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయమైన సరే.. మాములుగా వైరల్ అవడం లేదు. కాగా.. తాజాగా అలాంటి ఓ వార్తే సోషల్ మీడియాను ఊపేస్తుంది.అదేంటంటే... ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు ప్రభాస్ కూడా కీలక రోల్ పోషిస్తున్నట్లు ఇండస్ట్రీలో ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కూడా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం... ప్రభాస్ ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడట. అంతే కాదు.. ఆయన రోల్ ఏదో అలా వచ్చి వెళ్లినట్లు కాకుండా.. సెకండ్ పార్ట్‌కు లీడ్‌గా ఉండబోతుందని తెలుస్తుంది.ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది. నిజానికి ఇది కేవలం రూమర్ అని కొట్టిపారేలేం కూడా. 

ఎందుకుంటే... సుజీత్‌కు, ప్రభాస్‌కు మధ్య మంచి బాండింగ్ ఉంది. అది కాకుండా.. సుజీత్ సైతం, చాలా సందర్భాల్లో ప్రభాస్, పవన్ కళ్యాణ్‌లు ఇద్దరు తన కళ్లు అని చెప్పాడు. అలాంటప్పుడు ఒకే సినిమాలో ఇద్దరిని పెట్టడం పెద్ద కష్టమేమి కాదు.ఈ క్రమంలో అందుతున్న సమాచారం ప్రకారంనిన్ననే ఓజి క్లైమాక్స్ లో ఏకంగా ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది అన్నట్టుగా రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. దీనితో మేకర్స్ వీటిపై ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు. అయితే ఇపుడు ఫ్రెష్ రూమర్స్ ఏమిటంటే ఓజి క్లైమాక్స్ లో ఓ బిగ్ స్టార్ ఎంట్రీ ఉంటుంది అనేది నిజమేనట. కానీ అది ప్రభాస్ అనేది ప్రస్తుతానికి అవాస్తవం.సరే దీని ప్రకారం ప్రభాస్ కాకపోతే ఆ రోల్ ని ఇంకో స్టార్ చేయాల్సిందే కదా.మరి లేటెస్ట్ రూమర్స్ ఏమిటంటే ఈ పాత్రని మన తెలుగు బిగ్ స్టార్ కాదు కానీ కన్నడ సినిమాకి చెందిన బిగ్ స్టార్ చేయనున్నారు అంటూ కొత్త రూమర్స్ మొదలయ్యాయి. ఆ హీరో ఎవరో కాదు కన్నడ అభినయ చక్రవర్తి మన తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా తెలిసిన హీరో కిచ్చా సుదీప్ అట.ఇపుడు సుదీప్ పేరే ఎందుకు వచ్చింది అంటే. గతంలో సుజీత్ సుదీప్ తో వర్క్ పై ఇంటర్వ్యూ క్లిప్ వైరల్ గా మారింది. సుజీత్ తో ఆల్రెడీ తాను ఓ సినిమా డిస్కషన్స్ లో పాల్గొన్నామని సుజీత్ దగ్గర పలు క్రేజీ ఐడియాస్ కూడా ఉన్నాయి. మేము ఓ సినిమా చేస్తామని తాను తెలిపాడు. ఇది పక్కన పెడితే కొన్నేళ్ల ముందు ఒకసారి సడెన్ గా సుదీప్ పవన్ కళ్యాణ్ ని కలవడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఈ డాట్స్ అన్నీ కలిపి చూస్తే ఈ క్రేజీ కాంబినేషన్ పై కూడా పాజిబులిటీ ఉందని చెప్పొచ్చు. మరి ఓజి క్లైమాక్స్ లో వచ్చే ఆ స్టార్ ఎవరో డెఫినెట్ గా చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

og