మలయాళం స్టార్ ఫహాద్ ఫాజిల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఓవైపు మలయాళంలో హీరోగా చేస్తూనే మరోవైపు నెగిటివ్ రోల్స్ కూడా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ్ సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. పుష్ప 1 సినిమాలో బన్వర్ సింగ్ షేకావత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి పార్టీ లేదా పుష్ప అంటూ అదరగొట్టాడు.


పుష్ప 2 సినిమాలో కూడా ఫహాద్ ఫాజిల్ కు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ను ఇచ్చారు. ఇక ఇటీవల వచ్చిన రజనీకాంత్ సినిమాలోను ఫహద్ ఫాజిల్ ఓ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అయితే ఫహాద్ ఫాజిల్ కెరీర్ లో ఓ ఘటన జరిగింది. హీరో అవకాశాలు వచ్చినప్పటికీ నేచురల్ గానే నటించాలనే కారణంతో వచ్చిన అవకాశాలను వదులుకున్న సందర్భాలు ఫహద్ ఫాజిల్ కెరీర్ లో ఎన్నో ఉన్నాయట. ఫాజిల్ తన కెరీర్ లో జరిగిన కొన్ని సంఘటనలను వెల్లడించాడు.


కెరీర్ ఆరంభంలో కొందరు దర్శకులు హీరోగా నన్ను బట్టతలతో చూపించడానికి ఇష్టపడలేదని ఫాజిల్ తెలిపాడు. విగ్గు పెట్టుకొని నన్ను నటించమని దర్శకులు అడిగారు. కానీ అలా నటించడం నాకు ఇష్టం లేదు. అందువల్ల నేను వచ్చిన హీరో అవకాశాలను వదులుకున్నానని ఫాజిల్ వెల్లడించాడు. నా సినిమాలలో సూపర్ డీలక్స్, సియు సూన్, ట్రాన్స్, జోజి, మాలిక్ లాంటి సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వడంతో తెలుగు ప్రేక్షకులకు నేను బాగా దగ్గర అయ్యానని ఫహాద్ ఫాజిల్ చెప్పుకొచ్చాడు.


అలాగే పుష్ప 2లో తన పాత్ర ఎలా ఉంటుందో రివిల్ చేశాడు. అల్లు అర్జున్ కి దీటుగా తన పాత్రను సుకుమార్ మలిచినట్లుగా తెలియజేశాడు. ఈ సినిమా కోసం తెలుగు నుంచి డబ్బింగ్ చెప్పినట్లుగా ఫాజిల్ చెప్పాడు. కానీ తెలుగు నేర్చుకోవడం చాలా కష్టంగా ఉందని ఫహాద్ ఫాజిల్ అన్నాడు. ప్రస్తుతం ఫహాద్ ఫాజిల్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: