ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2 ఫీవర్ గట్టిగా కనిపిస్తుంది .. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల‌ ముందుకు రాబోతుంది .. ఈ సినిమా విడుదలకు ముందే థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ 1000 కోట్లకు పైగా చేసింది. ఇలా పుష్ప2 విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలు పెంచుకుంటూ వెళ్లిపోతుంది . అయితే ఇప్పుడు పుష్ప1న్ సాధించిన అరుదైన రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..


ఇక పుష్ప1న్ సాధించిన అరుదైన రికార్డులు విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరోగా నటించినందుకు గాను అల్లు అర్జున్‌కి జాతియ‌ అవార్డు వచ్చింది .. టాలీవుడ్ చరిత్రలో ఉత్తమ నటుడుగా ఈ అవార్డు అందుకున్న తొలి హీరో. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడుగా దేవిశ్రీప్రసాద్ కూడా నేషనల్ అవార్డు  దక్కింది. అలాగే ఈ సినిమాకు 7 ఫిలింఫేర్, 7 సైమ అవార్డులు వరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 360 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టండి. కేవలం హిందీలోనే 108 కోట్ల నెట్ కలెక్షన్ రాబట్టింది. ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల్లో తెలుగులో 8 స్థానంలో పుష్ప ఉంది.


అలాగే ఈ సంవత్సరం నిర్వహించిన 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా ప్రదర్శితమైంది. అలాగే మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ఈ మూవీ ఆ తర్వాత రష్యన్ లో కూడా డబ్బైంది. యూట్యూబ్ లో విడుదలైన 24 గంటల్లో అత్యధిక మంది చూసి లైక్ చేసిన టీజర్ కూడా పుష్పదే. అలాగే 2022లో యూట్యూబ్లో 6 బిలియన్ ప్లస్ వ్యూస్ సొంతం చేసుకున్న తొలి ఇండియన్ ఆల్బమ్ పుష్ప. అలాగే పుష్ప డైలాగ్స్ పాటలతో ఇనిస్టాలు 10 బిలియన్ ప్లస్ రీల్స్ రావడం మరో విశేషం. ఇక 2022 లో అమెజాన్‌ ప్రైమ్ వీడియోలు ఎక్కువమంది చూసిన‌ సినిమా కూడా ఇదే. దాదాసాహెబ్ ఫిలిం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఫిలిం ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుందుకుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: