అలనాటి నటి సిల్క్ స్మిత ప్రతి ఒక్కరికి పరిచయమే. తెలుగు ప్రేక్షకులను తన అందంతో ఎంతగానో ఆకర్షించింది. సిల్క్ స్మిత ఎలాంటి సినిమాలో నటించిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేది. దాదాపు ఈ బ్యూటీ 300కి పైగా సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిందనే చెప్పవచ్చు. తన నటన, అందంతో ఎంతో డబ్బు, మంచి గుర్తింపును సంపాదించుకుంది. కానీ తాను చనిపోయే చివరి క్షణంలో ఎంతో నరకాన్ని అనుభవించి మరణించింది.


సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. చిన్న వయసు నుంచే కుటుంబంలో అనేక రకాల ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడింది. చిన్నతనంలోనే తన చదువును మానేసింది. సిల్క్ స్మితకు 14 ఏళ్ల వయసులోనే వివాహం చేశారు. దాంతో తన జీవితం దుర్భరంగా మారిపోయింది. తన భర్త, అత్తమామలు ఎప్పుడు వేధిస్తూ ఉండేవారు. తన అత్తింటి నుంచి వేధింపులు తట్టుకోలేక ఇంట్లో నుంచి సిల్క్ స్మిత పారిపోయి డబ్బు సంపాదించడం కోసం సినీ ప్రపంచాన్ని ఎంచుకుంది.


ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించింది. కానీ తన కెరీర్ విషాదంలో మునిగిపోయింది. తన చావుకు ఎంతోమంది కారణమంటూ అనేక రకాల వార్తలు వచ్చాయి. అందులో స్టార్ హీరో రజనీకాంత్ పేరు కూడా ఉంది. సిల్క్ స్మిత మరణానికి రజనీకాంత్ కూడా కారణం అంటూ అప్పట్లో అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. రజనీకాంత్ సిల్క్ స్మితతో ప్రేమాయణం నడిపించారట. ఆమె లేకుంటే రజనీకాంత్ సినిమాలలో అసలు నటించేవాడు కాదట. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులలో హైలెట్ అయింది.


వీరి కెమిస్ట్రీ చాలా బాగుండేది జోడి కూడా అద్భుతంగా ఉండడంతో ప్రతి ఒక్కరూ రజనీకాంత్, సిల్క్ స్మిత ప్రేమించుకున్నారని టాక్ వినిపించింది. కాగా సిల్క్ స్మిత నిర్మాతగా మారి కొన్ని సినిమాలు చేసింది. దీంతో చాలా నష్టపోయి మానసిక క్షోభను ఎదుర్కొంది. అలాగే రజినీకాంత్ బ్రేకప్ చెప్పడం కారణంగానే సిల్క్ స్మిత చెడు వ్యసనాలకు అలవాటు పడిందట. అందుకే ఆమె చావుకు రజనీకాంత్ కూడా ఓ కారణమంటూ అనేక రకాల వార్తలు వినిపించాయి. ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో ఇప్పటివరకు బయటపడలేదు. అంతేకాదు.. సిగరేట్‌ తో కూడా కాల్చినట్లు చెబుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: