మరో మూడు రోజుల్లో పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానుంది .. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి .. అయితే ఇప్పుడు పుష్పా2 టికెట్ల వ్యవహారం ఎంతో హాట్ టాపిక్ గా మారింది .  ఈ సినిమా టికెట్ల రేట్లు ఊహించని రేంజ్ లో పెంచేశారు నిర్మాతలు .. మధ్యతరగతి కుటుంబం వారు ఈ సినిమా టికెట్లు కొనాలంటే దాదాపు 500 నుంచి ₹1000 వరకు ఖర్చు పెట్టాల్సిందే .  ఫ్యామిలీ మొత్తం ఈ సినిమా చూడాలంటే దాదాపు 10000 లెగిసి పోవాల్సిందే . ఈ విధంగా పుష్ప2 టికెట్లు గతంలో ఈ సినిమాకి లేని విధంగా భారీ స్థాయిలో పెంచేశారు .. అయితే ఇప్పుడు  రీసెంట్గా జరిగిన పుష్ప ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ... నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి .. బిస్కెట్ ప్యాకెట్ పది రూపాయలు నాకు 100 కోట్లు ఉన్నాయని, ₹10 బిస్కెట్ ప్యాకెట్ను .. 100 రూపాయలు పెట్టి కొన్నాను. దాని విలువ పది రూపాయలు, నా దగ్గర 1000 కోట్లు ఉన్న దేనికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి ఇస్తా. నా దగ్గర ఎంత ఉంది అనేదానికంటే ఆ ప్రోడక్ట్ కు ఎంత విలువ ఉందనేది చూస్తాను ..


పుష్ప 2 టిక్కెట్ల రేట్లు పెంచడానికి కొన్ని రోజుల ముందు అల్లు అర్జున్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది .. ఇక ఇప్పుడు ఈ స్టేట్మెంట్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నేటిజెన్లు .. వందల కోట్లు ఆస్తి ఉన్న అల్లు అర్జున్ అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు మధ్య తరగతికి చెందిన తాము ఎందుకు టిక్కెట్ కు వెయ్యి రూపాయలు పెట్టాలని ప్రశ్నిస్తున్నారు .. ఇదే క్రమంలో అల్లు అర్జున్ కూడా మిడిల్ క్లాస్ అనే విషయాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు కొందరు .. ఈ స్టేట్మెంట్ కూడా అల్లు అర్జున్ ఇచ్చారు.  నేను బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టినప్పటికీ మా నాన్న , తాతయ్య మిడిల్ క్లాస్ లో పుట్టం కారణంగా వారు డబ్బులు సంపాదించినప్పటికీ ఆ మిడిల్ క్లాస్ అలవాటు నుంచి బయటకు రాలేదు కాబట్టి .. నేను కూడా అదే మనస్తత్వంలో పుట్టి పెరిగాను నాది వెరీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ . అయితే ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీ తో ఆలోచిస్తే పుష్ప 2 రిలీజ్ అయిన మొదటి నాలుగు రోజులు థియేటర్ల వైపు ఎవరైనా వెళ్తారా ? ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమాకు టికెట్ రేట్లు పెంచారు కానీ పుష్ప2 కోసం పెంచిన రేట్లు మాత్రం ఇప్పుడు ఎంతో రచ్చ చేస్తున్నాయి.


ఇక తెలుసు తెలియకో చాలామందికి పుష్ప2 నిర్మాతలు దారి చూపించారు .. సినిమా రిలీజ్ ఎంత ఆలస్యమైనా పర్లేదు .. వందల కోట్లు వడ్డీ కట్టిన టెన్షన్ పడొద్దు.. బడ్జెట్ నిర్మాతలు చేయి దాటపోయిన ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు.. హీరో 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న నథింగ్ ఎందుకంటే విడుదలకు ముందు సరిగా ప్రభుత్వంలో తెలిసిన వారిని కలిసామా కింద మీద పడి టిక్కెట్ల జీవో తెచ్చుకున్నామా .. ఇదే ఇప్పుడు ఇంపార్టెంట్ గా మారింది ఇదొక్కటి చేస్తే చాలు అందిన కాడికి దండుకోవచ్చు .. హీరో క్రేజ్ను థియేటర్లో కాసుల రూపంలో దొరుకును కాడికి  లాక్కోవచ్చు.  ఇదే జరిగితే సినిమాల థియేటర్ల సంగతేంటిి ? ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళటం మానేశారు . మరికొందరు పూర్తిగా సినిమాలు చూడటం మానుకున్నారు ఓటీటీకే ఎక్కువ జై కొడుతున్నారు .. ఇలాంటి సమయంలో స్టార్ హీరో సినిమాకు కామన్ ఆడియన్స్ థియేటర్‌ల‌ వైపు ఆకర్షించేలా ప్రణాళికలు ఉండాలి కానీ ఇలా భారీ రేట్లు పెంచుకుంటే ఎలా. ఇక ఇదే జరిగితే రాబోయే కాలంలో ఎంత పెద్ద హీరో సినిమాకి అయినా థియేటర్లో అభిమానులు మాత్రమే చూస్తారు .. మిగతా వారంతా ఇంట్లో కూర్చుని ఓటీటీలో చూస్తారు .. ఇప్పటికే ఎంతో మంది మధ్య తరగతి కుటుంబాలు ఇదే ఫీలింగ్ లో ఉన్నారు .. పుష్ప 2 టైప్ లో మరో మూడు సినిమాలు వస్తే ఇండస్ట్రీకి క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది .. తమని తాము మిడిల్ క్లాస్ గా ఫీల్ అయ్యే బన్నీ లాంటి హీరోలైన ఈ దిశగా ఆలోచిస్తే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: