ఏపీ మినహా అన్ని ఏరియాలలో ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే పుష్ప ది రూల్ మూవీ విషయంలో మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండానే బన్నీ ముందుకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బన్నీ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని కొందరు మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇతర స్టార్ హీరోలు సైతం ఎంత ఎదిగినా ఒదిగి ఉంటుండగా బన్నీ వాళ్లకు భిన్నంగా అడుగులు వేస్తున్నారని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
పుష్ప ది రూల్ భారీ టికెట్ రేట్లు సినీ అభిమానులకు షాకిస్తున్నాయి. ముంబైలో ఈ సినిమాకు మరీ భారీ స్థాయిలో బుకింగ్స్ జరగడం లేదు. సినిమాకు ఏ మాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా ఆ ప్రభావం రిజల్ట్ పై పడే ఛాన్స్ ఉంది. టికెట్ రేట్ల విషయంలో పుష్ప2 హద్దులు దాటిందని కామెంట్లు వినిపిస్తుండగా మెగా ఫ్యాన్స్ సపోర్ట్ తో ఎదిగిన బన్నీ ఇప్పుడు తన ఆటిట్యూడ్ తో కొంతమంది అభిమానులను దూరం చేసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
వ్యాపారం కోసం అభిమానాన్ని వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ సినిమాకు రన్ టైమ్ ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాలి. పుష్ప ది రూల్ బుకింగ్స్ బాగానే ఉన్నా మరీ టికెట్లు దొరకని పరిస్థితి రాలేదు. పుష్ప ది రూల్ ఫస్ట్ డే కలెక్షన్లు మాత్రం భారీ స్థాయిలో ఉండబోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.