పుష్ప-2 సినిమా రిలీజ్ కు ముందు నుంచే సత్తా చాటుతున్నది.ముఖ్యంగా ఈ సినిమాకి భారీ హైప్ కూడా ఏర్పడింది. అల్లు అర్జున్ ,సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమయ్యింది. ప్రీ సేల్ బుకింగ్స్ ని ఓపెన్ చేయగా రికార్డ్ స్థాయిలో ఈ సినిమా టికెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. దీంతో పుష్ప-2 ది రూల్ సినిమా సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తోంది. హిందీ వర్షన్ టికెట్స్ ఓపెన్ చేసిన వెంటనే క్షణాలను హాట్ కేకుల టికెట్లు సైతం అమ్ముడుపోయాయట.


24 గంటలలోనే లక్ష టికెట్లు సేల్ అవ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో కచ్చితంగా బాలీవుడ్లో పుష్ప-2 సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని విధంగా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్.. అయితే ఇప్పటివరకు స్త్రీ-2 సినిమా 41k.. షారుఖ్ ఖాన్ నటించిన డంకి 42k.. యానిమల్ సినిమా..52.5k.. టైగర్-3..65k వంటి చిత్రాలను సైతం పుష్ప-2 సినిమా అధికమించి ఏకంగా బాలీవుడ్ లోనే ఆల్ టైం టాప్ చిత్రాల లిస్టులో మూడవ స్థానంలో నిలిచిందట..


ప్రీ  బుకింగ్ లోనే ఈ సినిమా ఇప్పటివరకురూ .60 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి..RRR, బాహుబలి, కేజిఎఫ్-2 చిత్రాలతో తొలి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రాలు ఇప్పుడు పుష్ప-2 సినిమా వీటన్నిటిని దాటేస్తుందని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మరొకవైపు విడుదల సమయం దగ్గర పడుతూ ఉన్న కొద్ది చిత్ర బృందం అయితే జోరుగానే ప్రమోషన్స్ ని మొదలుపెట్టింది ఇప్పటికే ముంబై , కొచ్చి వంటి ప్రాంతాలలో కూడా ప్రత్యేకమైన ఈవెంట్లను సైతం నిర్వహించారు. హైదరాబాదులో భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజున జరగబోతోంది సుమారుగా 8000 మందికి ఇక్కడ పాసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎవరూ వస్తారనే విషయం పైన ఇప్పుడు ఎగ్జైటింగ్ గా ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: