ఏంటి ఆ నటుడు నానుం రౌడీధాన్ సినిమాలో చేసి ఉంటే నయనతార విజ్ఞేష్ శివన్ ల పెళ్లి జరిగేది కాదా.. వారి మధ్య ప్రేమ పుట్టి పెళ్లి జరగడానికి కారణం ఆయనేనా.. ఇంతకీ ఆ నటుడు ఎవరు.. ఎందుకు ఆయన ఈ మాటలు మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం.. ధనుష్ నిర్మాతగా విజ్ఞేష్ శివన్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి నయనతారలు హీరో హీరోయిన్లు గా చేసిన నానుం రౌడీధాన్ సినిమా గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పక్కన పెడితే.. నానుం రౌడీధాన్ సినిమాలో మొదట హీరో అవకాశం నటుడు శివ కి వచ్చిందట.. కానీ ఈయన సినిమాలో చేయకపోవడం వల్ల అది కాస్తా విజయ్ సేతుపతికి వెళ్ళింది. 

అయితే ఈయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నానుమ్ రౌడీ ధాన్ మూవీలో మొదట హీరో అవకాశం నాకే వచ్చింది.నేను సెట్ అవుతానని విగ్నేష్ శివన్ నాకు స్టోరీ చెప్పారు. కానీ ఆ పాత్ర ఎందుకో నాకు సెట్ అవ్వదు అనిపించింది. అందుకే అందులో నుండి తప్పుకున్నాను. నేను తప్పుకోవడంతో అందులోకి విజయ్  సేతుపతి వచ్చారు. హీరోయిన్గా నయనతార వచ్చింది. ఒకవేళ నేను హీరోగా చేసి ఉంటే నయనతార నా పక్కన హీరోయిన్ గా చేసి ఉండకపోయేది.

అలాగే నయనతార విగ్నేష్ శివన్ లు కలిసేవారు కాదు. ఒక రకంగా చెప్పుకోవాలంటే నేను ఈ సినిమా నుండి తప్పుకోవడం వల్లే విజ్ఞేష్ శివన్ నయనతారలు ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ, పెళ్లికి కారణం నేనే అంటూ నటుడు శివ నాడుం నాట్టు మక్కలుం అనే సినిమా ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని బయట పెట్టారు. ప్రస్తుతం ఈయన మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తమిళ నటుడు శివ 12B,  పదినారు, చెన్నై600028, వణక్కం చెన్నై వంటి  సినిమాలో నటించారు

మరింత సమాచారం తెలుసుకోండి: