టీజర్ విషయానికి వస్తే ప్రపంచంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో జరిగేటువంటి దృశ్యాలను చూపించినట్టుగా కనిపిస్తోంది..యూఐ ది చిత్రం కూడా సరికొత్త కదా అంశం అన్నట్లుగా కనిపిస్తోంది. 2040 కల్లా ప్రజల ఎలా ఉంటారు వారి పరిస్థితిలో ఎలా ఉంటాయి అనే విషయాన్ని టీజర్ మొదట్లో చూపించారు. ముఖ్యంగా 2040లో ఆహారం కోసం ఒకరినొకరు ప్రజలు చంపుకునే రోజులు కూడా వస్తాయని ఈ టీజర్ లో అయితే చూపించారు.. అలాగే ఇందులో కొన్ని విజువల్స్ కూడా కేజిఎఫ్ సినిమాను తలపించేలా కనిపిస్తూ ఉన్నాయి.. చివరిలో ఉపేంద్ర చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకునేలా ఉన్నది . మీదిక్కారం కన్నా నా అధికారానికే పవర్ ఎక్కువ అంటూ ఉపేంద్ర ఒక మిషన్ గన్ తో ఫైర్ చేస్తారు.
డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకి యూఐ ది సినిమా రాబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా చిత్ర బృందం మొదలు పెట్టింది. ఇందులో రేష్మ ననైయ, సన్నీలియోన్, మురళీ శర్మ, జిగుసేన్ గుప్త తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారట. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతున్న యూఐ ది ఉపేంద్ర సినిమా మరి ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతం టీజర్ అయితే మాత్రం అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తూ ఉన్నది.