టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు చేసినవి తక్కువ సినిమాలు అయినప్పటికీ ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అంతేకాకుండా ప్రేక్షకుల మనసులను దోచుకొని చెరగని ముద్ర వేసుకుంటారు. అలాంటి హీరోయిన్లు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. వారిలో అనిత ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. దివంగత హీరో ఉదయ్ కిరణ్ హీరోగా చేసిన నువ్వు నేను సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్గా చేసింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.


ముఖ్యంగా అబ్బాయిల కలల డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా సక్సెస్ తో అనితకు మంచి పేరు లభించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటికీ చాలామంది ఈ సినిమా పాటలను వింటూనే ఉంటారు. దీనికి తేజ దర్శకత్వం వహించాడు. ఉదయ్ కిరణ్, అనిత పెయిర్ చాలా క్యూట్ అండ్ లవ్లీగా ఉంటుంది. నువ్వు నేను సినిమా తర్వాత అనితకి విపరీతంగా సినిమా అవకాశాలు వచ్చాయి.


తన కెరియర్ సక్సెస్ గా దూసుకుపోతున్న సమయంలో 2013లో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. తన పూర్తి సమయాన్ని తన భర్తకి కేటాయించింది. ప్రస్తుతం అనిత సంతోషంగా తన జీవితాన్ని గడుపుతోంది. ఈ బ్యూటీ వయసు 43 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో అభిమానులను ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియాలో తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ చేరువలో ఉంటుంది. కాగా, అనితకి సంబంధించిన ఓ వార్త ఈ మధ్యకాలంలో తెగ వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ తనకన్నా పెద్ద వయసున్న అంకుల్ తో ఎఫైర్ పెట్టుకుంది అంటూ ఓ రూమర్ వైరల్ అవుతుంది. అతని వయసు 50 సంవత్సరాలు అని సమాచారం. ఈ వయసులో అంత పెద్ద అంకుల్ తో ఎఫైర్ పెట్టుకోవడం అవసరమా అంటూ కొంతమంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: